Home » Delhi
వ్యర్థ పదార్ధాలను తగులబెట్టేందుకు బయోఫ్యూయెల్స్ వాడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయని సీజేఐ అన్నారు. రైతులు ప్రత్యేకమైన వారే, వాళ్ల వల్లే మనకు అన్నం దొరుకుతుంది. అలాగని పర్యవారణాన్ని పాడుచేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా అని ప్రశ్నించారు.
ఢిల్లీ యూనర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు ఈనెల 18వ తేదీ గురువారంనాడు జరుగనుండగా, ఫలితాలు శుక్రవారంనాడు వెలువడతాయి. డే క్లాసెస్ వారికి ఓటింగ్ ప్రక్రియ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈవెనింగ్ క్లాసెస్ వారికి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓటింగ్ ఉంటుంది.
ఢిల్లీలో భారత్-అమెరికా మధ్య నిన్న జరిగిన వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ప్రయోజనాల కోసం త్వరలోనే ఒప్పందం గురించి చర్యలు తీసుకుంటామని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
బాలకృష్ణుడు చిన్నతనంలో వెన్నంటే ఎంతో ఇష్టపడే వాడని, అందుకే ఆయనను అంతా వెన్నదొంగగా ముద్దుగా పిలుచుకునే వారని చెప్పారు. కృష్ణుడు మఖాన్‌చోర్ అయితే మోదీ 'మన్ కీ చోర్' అని పోలిక తెచ్చారు.
భారతదేశంలోనే ఎక్కువ ఎకరాల్లో పామాయిల్ సాగుచేసే రాష్ట్రంగా తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నూతన విత్తన చట్టాన్ని, భారత రైతాంగానికి శ్రేయస్సు చేకూర్చే విధంగా అంగీకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
ఢిల్లీలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామితో తుమ్మల మంగళవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఈరోజు మళ్లీ ప్రారంభం కానున్నాయి. న్యూఢిల్లీలో జరిగే ఈ చర్చలు ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు, వాణిజ్య సంబంధాలను తిరిగి బలోపేతం చేయాలనే లక్ష్యంగా జరగనున్నాయి.
నటి కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. రైతుల నిరసనలపై తాను చేసిన వివాదాస్పద ట్వీట్‌కు సంబంధించి..
ఢిల్లీ హైకోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. మూడు ప్రదేశాల్లో RDX పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు.
దొంగను పట్టుకోవడంలో పోలీసులకు యూపీఐ సహకరించింది. ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో ఉన్న ఓ జైన ఆలయంలో కలశాన్ని దొంగిలించిన భూషణ్ వర్మ అనే వ్యక్తిని పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో అరెస్ట్ చేశారు. అతడి నుంచి వంద గ్రాముల బంగారాన్ని, విలువైన రాళ్లు పొదిగిన కలశాన్ని స్వాధీనం చేసుకున్నారు.