Share News

Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం సీరియస్.. కేంద్రంపై మండిపాటు..

ABN , Publish Date - Dec 01 , 2025 | 05:24 PM

ఢిల్లీ కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల దహనమే కారణమన్న కేంద్రంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. రైతులను నిందించడమే కేంద్రానికి ఆనవాయితీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం సీరియస్.. కేంద్రంపై మండిపాటు..
Delhi Pollution

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఢిల్లీ కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల దహనమే కారణమన్న కేంద్రంపై మండిపడింది. రైతులను నిందించడమే కేంద్రానికి ఆనవాయితీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిడ్ సమయంలో కూడా రైతులు తమ పంట వ్యర్థాలను తగలపెట్టారని, అప్పుడు లేని కాలుష్యం ఇప్పుడెలా వచ్చిందని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.


వాయు కాలుష్యానికి ఇతర కారణాలేమిటో చెప్పాలని అంది. కాలుష్య కారకాలను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా జనం తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చిన్న పిల్లలు ముక్కు, గొంతు సంబంధిత సమస్యలతో అల్లాడిపోతున్నారు. సర్జరీలు సైతం చేయించుకోవాల్సి వస్తోంది.


ఢిల్లీలో వాయు కాలుష్యానికి చుట్టు పక్కల రాష్ట్రాల ప్రజలు పంట వ్యర్థాలను కాల్చటం ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత సెప్టెంబర్ నెలలో సుప్రీంకోర్టు పంట వ్యర్థాలను కాల్చే రైతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను కాల్చే వారిని జైల్లో వేయాలని అంది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ మాట్లాడుతూ.. ‘రైతులు ప్రత్యేకమైనవారు. కాదనడం లేదు. వారి కారణంగానే అన్నం తింటున్నాం. అలాగని పర్యావరణాన్ని రక్షించకుండా ఉండలేం’ అని అభిప్రాయపడ్డారు.


ఇవి కూడా చదవండి

దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు సీరియస్.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశం..

Updated Date - Dec 01 , 2025 | 05:42 PM