Roadside Stone Artistic Clock: ఇది కదా టాలెంట్ అంటే.. రోడ్డు పక్క రాళ్లను వేల రూపాయలకు అమ్మేస్తున్నాడు..
ABN , Publish Date - Dec 01 , 2025 | 03:01 PM
ఢిల్లీకి చెందిన ఓ యువకుడు రోడ్డు పక్కన పడున్న రాళ్లను తన ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు. వాటిని అందమైన గడియారాలుగా మార్చి అమ్మేస్తున్నాడు. వందల నుంచి వేల రూపాయలు సంపాదిస్తున్నాడు.
టాలెంట్ ఎవరి సొత్తు కాదు. ఇందుకు పేద, ధనికం అన్న తేడా లేదు. పేదరికంలో పుట్టి తమ టాలెంట్‌తో గొప్ప గొప్ప వ్యాపారవేత్తలుగా వెలుగొందిన వారు చాలా మందే ఉన్నారు. ఒక చిన్న ఐడియా మన జీవితాన్నే మార్చేయవచ్చు. ఇందుకు తాజాగా, జరిగిన ఓ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఓ యువకుడు తన టాలెంట్‌తో రోడ్డు పక్క పడున్న రాళ్లను తీసుకువచ్చి వేల రూపాయలకు అమ్మేస్తున్నాడు. రాళ్లను డబ్బులు పెట్టి ఎవరు కొంటారు? అని అనుకుంటున్నారా? ఇక్కడే ఆ యువకుడు తన తెలివితేటల్ని ఉపయోగించాడు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ యువకుడు రోడ్డు పక్కన పడున్న రాళ్లను తన ఆదాయ మార్గంగా మార్చుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం ఓ అద్భుతమైన ఐడియా వేశాడు. మీడియం సైజు రాళ్లను సేకరించి వాటికి ఓ వైపు రంధ్రం చేశాడు. అందులో గడియారానికి సంబంధించిన మోటార్‌ను బిగించాడు. ఆ రాయికి రంగు పూసి, అందమైన గడియారంలా తయారు చేశాడు. తర్వాత ఆ రాళ్ల గడియారాలను రోడ్డు పక్క అమ్మకానికి పెట్టాడు.
వాటిని 400 నుంచి 5 వేల రూపాయల వరకు అమ్మాడు. నిమిషాల్లోనే పెట్టిన పెట్టుబడికి 900 రెట్లు ఆదాయాన్ని పొందాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇందుకు ఈ యువకుడే ప్రత్యక్ష ఉదాహరణ’..‘రాళ్లను గడియారాలుగా మార్చి అమ్మేస్తున్నాడు. నిజంగా ఇతడి టాలెంట్ వేరే లెవెల్’ అంటూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇషాన్ కిషన్ వరల్డ్ రికార్డు.. తొలి ప్లేయర్‌గా
బాలీవుడ్ తరహాలో భారతీయ అమెరికన్ 'లవ్ ప్రపోజల్'.. వీడియో వైరల్