Love Propose at Time Square: బాలీవుడ్ తరహాలో భారతీయ అమెరికన్ 'లవ్ ప్రపోజల్'.. వీడియో వైరల్
ABN , Publish Date - Dec 01 , 2025 | 02:01 PM
లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. అంటే చూడగానే ప్రేమలో పడిపోవడం. అలా ప్రేమించిన వారికి వినూత్న రీతిలో ప్రపోజ్ చేసేందుకు యత్నిస్తుంటారు కొందరు. ఆ సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోవాలని ప్రత్యేకంగా సన్నద్ధమవుతుంటారు. అలాంటి కొన్ని ప్రపోజల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఆ రకమైన స్పెషల్ ప్రపోజల్ ఒకటి మీకోసం...
ఇంటర్నెట్ డెస్క్: ప్రేమించిన అమ్మాయికి వెరైటీగా, చిరకాలం గుర్తుండేలా తమ ప్రేమను వ్యక్తపరచాలని చూస్తుంటారు కొందరు. మొన్నీ మధ్య టీమ్‌ఇండియా స్టార్ బ్యాట్స్ఉమెన్ స్మృతి మంధానకు.. సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ కూడా అదే తరహాలో కళ్లకు గంతలతో స్టేడియంలోకి తీసుకువచ్చి సర్‌ప్రైజింగ్ ప్రపోజ్ చేశాడు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో నెట్టింట చక్కర్లు కొడుతుంటాయ్. అలాగే.. ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వేదికగా చేసిన ఓ లవ్ ప్రపోజల్ కూడా అందరినీ ఆకట్టుకుంటూ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అతను తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో తెలుసుకుందామా మరి...
ప్రపోజ్ చేశాడిలా..
పార్థ్ మణియర్ అనే భారతీయ అమెరికన్.. శ్రేయాసింగ్ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. తన ప్రేమను వ్యక్తపరిచేందుకు గానూ యూఎస్‌లో ప్రముఖ ప్రాంతమైన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌ను వేదికగా ఎంచుకున్నాడు. తొలుత ప్రియురాలికి కళ్లకు గంతలు కట్టి ఆమె స్నేహితులు అక్కడకు తీసుకువచ్చారు. కళ్లకు గంతలు విప్పాక.. పార్థ్ తన స్నేహితులతో కలిసి అచ్చం బాలీవుడ్ స్టైల్లో స్టెప్పులేస్తూ ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులు కూడా అక్కడకు చేరుకుని కాలు కదిపారు. దీంతో శ్రేయ భావోద్వేగానికి గురైంది.
ఈ సన్నివేశాన్నంతా శ్రేయ.. తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో బాలీవుడ్ సినిమాను తలపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. క్యూటెస్ట్ ప్రపోజల్ అని, వావ్ మూమెంట్ అని.. ఇలా భిన్న రకాలుగా స్పందిస్తూ తమ స్నేహితులతో దీని గురించే చర్చించుకుంటున్నారు.
ఇవీ చదవండి: