Home » Delhi liquor scam
దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలును ఉపసంహరించుకున్నారు. మనీలాండరింగ్ విచారణకు సంబంధించి కేజ్రీవాల్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ప్రత్యేక సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ కస్టడీలో కవిత దినచర్య ఎలా ఉందనే దానిపై పలు కథనాలు వస్తున్నాయి. వాటి ప్రకారం కవిత రోజువారి దినచర్య ఈ విధంగా ఉన్నట్లు తెలుస్తోంది..
దిల్లీ మద్యం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) అరెస్టు అవడంతో దేశ రాజధానిలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం దిల్లీ అసెంబ్లీ విడుదల చేసిన బులెటిన్‌లో సభను రద్దు చేయాలని స్పీకర్ ఆదేశించారు.
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. తన అరెస్ట్ చట్టవిరుద్దమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారణ నిర్వహించింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశాలను గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు సుప్రీం ధర్మాసనం జత చేసింది.
అవినీతికి వ్యతిరేకంగా.. సుపరిపాలన అందిచడమే లక్ష్యంగా.. అన్నాహజారే ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ. అతి తక్కువ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దేశం మొత్తం పార్టీని విస్తరించేందుకు ఆప్ అధినేత కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు.
దాదాపు పదేళ్లుగా కేంద్రంలో మోదీ.. ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలో ఉన్నారు..! ఈ వ్యవధిలో మోదీకి ఎందరో తలొంచారు.. మరికొందరు ఎందుకొచ్చిన గొడవని సర్దుకున్నారు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. తన అరెస్ట్ అక్రమమని, తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై బీజేపీ ( BJP ) తీవ్ర స్థాయిలో మండిపడింది. కేజ్రీవాల్ సహకారం, అనుమతితోనే మద్యం పాలసీలో కుంభకోణం జరిగిందని ఆరోపించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. నేటి ఉదయం మరోసారి వైద్యపరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించనున్నారు. స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను ఈడీ అరెస్టు చేసింది. తన అరెస్టుపై కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ ఆయనను ఈడీ కోర్టులో హాజరుపరచనుంది.