Home » Delhi liquor scam
ఎమ్మెల్సీ కవిత నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కోర్డు లోపలికి వెళ్లే ముందు మీడియాతో ఆమె మాట్లాడారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత తెలిపారు. తాత్కాలికంగా జైలుకు పంపవచ్చని కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ఇప్పటికే ఒక నిందితుడు జీజేపీలో జాయిన్ అయ్యారు. మరొకరు టికెట్ ఆశిస్తున్నారు
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( Kejriwal ) సీఎం పదవికి రాజీనామా చేయలేదు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ ఈడీ కస్టడి నుంచి తొలి ఆర్డర్స్ సైతం జారీ చేసేశారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈడీ(ED) అధికారులు.. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) హాజరుపరుచనున్నారు.
మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం ప్రశ్నల వర్షం కురిపించింది. హోలీ సందర్భంగా విచారణకు విరామం ఇస్తారని.. ఒకవేళ విచారించినా గంటో, రెండు గంటలో ప్రశ్నిస్తారని కవితతోపాటు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ దేశ రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో (Aam Admi Party) పాటు ఇతర ప్రతిపక్షాలు ఆయన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ.. కేంద్రంలోని బీజేపీపై (BJP) విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు తాజాగా శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (MP Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయమని అన్నారు.
మద్యం కుంభకోణానికి (Liquor Scam) సంబంధించిన రికార్డులను కలిగి ఉన్న తన పాత ఫోన్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వదిలించుకున్నారని ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ వాదనల్ని తోసిపుచ్చిన ఆప్.. ఈ విచారణ బీజేపీ (BJP) కార్యాలయం నుంచి జరుగుతోందంటూ ఆరోపించింది.
దేశవ్యాప్తంగా హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్న తరుణంలో ఆప్ నేత అతిశీ కీలక ప్రకటన చేశారు. దిల్లీ మద్యం కేసులో తమ నాయకుడు కేజ్రీవాల్ ( Kejriwal ) ను అన్యాయంగా ఈడీ అరెస్టు చేసిందని ఆరోపించారు. ఈ కారణంగా తాము హోలీ ఆడలేకపోతున్నట్లు తెలిపారు.
లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పంపిన సమన్లను బేఖాతరు చేశారని, తద్వారా తన అరెస్ట్‌ని తానే కోరితెచ్చుకున్నారని అన్నారు. ఒకవేళ.. తనకు తొలిసారి సమన్లు వచ్చినప్పుడే స్పందించి ఉంటే, అరెస్ట్ అయ్యేవారు కాదేమోనని అభిప్రాయపడ్డారు.
Kavitha Arrest: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ ఇప్పట్లో వదిలేలా లేదు.!. లెక్కలు తేల్చాల్సిందేనని గట్టిగానే ఉన్నారు అధికారులు. ఇప్పటికే ఈడీ సమన్లు ఇవ్వడం, విచారణ, అరెస్ట్.. కస్టడీ.. మళ్లీ సోదాలు ఇలా వరుస షాకులిచ్చిన అధికారులు త్వరలో మరో కీలక పరిణామంతో తెలంగాణలోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది..
మద్యం కుంభకోణంలో కేసులో అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జలవనరుల శాఖకు జారీ చేశారు. ఇవాళ సమావేశం నిర్వహించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అతిషి సీఎం ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు.