Share News

Kejriwal Arrest: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ అంటే భయం.. ఆయన ఇప్పుడు మరింత ప్రమాదకరం

ABN , Publish Date - Mar 25 , 2024 | 08:34 PM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ దేశ రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో (Aam Admi Party) పాటు ఇతర ప్రతిపక్షాలు ఆయన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ.. కేంద్రంలోని బీజేపీపై (BJP) విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు తాజాగా శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (MP Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయమని అన్నారు.

Kejriwal Arrest: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ అంటే భయం.. ఆయన ఇప్పుడు మరింత ప్రమాదకరం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ దేశ రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో (Aam Admi Party) పాటు ఇతర ప్రతిపక్షాలు ఆయన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ.. కేంద్రంలోని బీజేపీపై (BJP) విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు తాజాగా శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (MP Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయమని అన్నారు. జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారారాని పేర్కొన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి (INDIA Alliance) ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో (Ramlila Maidan) నిరసన ర్యాలీ నిర్వహిస్తోంది. ఆ ర్యాలీకి మేమంతా హాజరవుతాం. కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అంటే భయం. కేజ్రీవాల్ లాంటి నాయకుడ్ని జైలులో వేస్తే, ప్రశాంతత లభిస్తుందని వాళ్లు (బీజేపీని ఉద్దేశిస్తూ) అనుకొని ఉంటారు. కానీ.. ఇప్పుడు కేజ్రీవాల్ మరింత ప్రమాదకరంగా మారారు. ఆయన జైలు నుంచి చేస్తున్న పనులు, బయట ఉండి చేయడం చాలా కష్టం. జైలు నుంచి పాలన కొనసాగిస్తున్నారు కాబట్టి, ప్రజలు ఆయన మాట వింటారు. ఆయనకు మద్దతుగా వస్తారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో జైలుకు వెళ్లిన నాయకులు కూడా మరింత బలంగా తయారయ్యారు’’ అని సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు.

ఇదిలావుండగా.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ (ED) మార్చి 21వ తేదీన అరెస్ట్ చేసింది. తాను అరెస్ట్ అయ్యాక జైలు నుంచి పాలన కొనసాగిస్తానని కేజ్రీవాల్ చెప్పడంతో.. బీజేపీ నేతలు ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు.. కేజ్రీవాల్ అరెస్టుపై వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ‘మై భీ కేజ్రీవాల్’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. దీని ద్వారా.. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని భావిస్తోంది. ఇదే సమయంలో ఢిల్లీ మంత్రి అతిషి (Atishi) మాట్లాడుతూ.. జైలు నుంచి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడపగలరని, ఎందుకంటే ఏ నియమం కూడా అలా చేయకుండా అతడ్ని ఆపలేదని, ఆయన దోషిగా నిర్ధారించబడలేదని అన్నారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 08:34 PM