Share News

Himanta Biswa Sarma: కేజ్రీవాల్ అలా చేసి ఉంటే అరెస్ట్ అయ్యేవారు కాదేమో.. హిమంత ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 24 , 2024 | 05:57 PM

లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) పంపిన సమన్లను బేఖాతరు చేశారని, తద్వారా తన అరెస్ట్‌ని తానే కోరితెచ్చుకున్నారని అన్నారు. ఒకవేళ.. తనకు తొలిసారి సమన్లు వచ్చినప్పుడే స్పందించి ఉంటే, అరెస్ట్ అయ్యేవారు కాదేమోనని అభిప్రాయపడ్డారు.

‘‘కేజ్రీవాల్‌కు ఈడీ 9 సార్లు పంపింది. అన్నిసార్లు సమన్లు వచ్చినా, వాటిని గౌరవించకపోతే.. తన అరెస్ట్‌ని తానే ఆహ్వానించినట్టు అర్థం వస్తుంది. ఒకవేళ కేజ్రీవాల్ తొలి సమన్లకే స్పందించి ఉంటే, బహుశా అరెస్ట్ అయ్యేవారు కాదేమో’’ అని హిమంత బిశ్వ శర్మ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్లను కూడా ప్రస్తావించారు. తమకు సమన్లు వచ్చిన వెంటనే వాళ్లిద్దరూ ఈడీ ముందు హాజరయ్యారని గుర్తు చేశారు. కానీ.. కేజ్రీవాల్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారని, రాజకీయ సానుభూతి కోసమే ఆయన ఇలా చేసినట్లు స్పష్టమవుతోందని చెప్పుకొచ్చారు. అంతకుముందు కూడా.. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యింది ఏ ఏజెన్సీ వల్లనో కాదని, తన చర్యలే వల్లేనని కూడా హిమంత వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ను శుక్రవారం ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్‌కి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) ఢిల్లీలో నగరవ్యాప్త నిరసనను ప్రకటించింది. తమ నాయకుడ్ని బీజేపీ (BJP) అక్రమంగా అరెస్ట్ చేయించిందని, ఇదొక ఫేక్ అరెస్ట్ పేర్కొంటూ.. క్యాండిల్‌లైట్ మార్చ్‌కి పిలుపునిచ్చింది. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో ఈ అరెస్ట్ ఓ కీలక మలుపు అవుతుందని ఆప్ అభిప్రాయపడుతోంది. కాగా.. ప్రస్తుతం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కూడా ఇదే కేసులో ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 05:57 PM