Home » Cyber Crime
ఎక్కడుంటారో తెలియదు.. ఎలా ఉంటారో తెలియదు. కానీ.. పెరిగిన టెక్నాలజీని వాడుకుంటూ రోజుకు లక్షల రూపాలయలను దోచేస్తున్నారు. నగరంంలో సైబర్ నేరగాళ్ల మోసాలకు అంతేలేకుండా పోతోంది. ప్రతి రోజూ ఈ తరహ మోసాలు జరుగుతూనే ఉన్నాయి.
సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరలేపారు. ఆన్లైన్లో మెడిసిన్ కోసం వెదికుతున్న వ్యక్త నుంచి రూ.2.25 లక్షలు కొట్టేశారు. ప్రతిరోజూ హైదరాబాద్ నగరంలో సైబర్ మోసానికి ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. ఈ తరహ మోసాలపై ప్రజల్లో ఒకింత అవగాహన తక్కువగా ఉండటంతో ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు.
టెక్నాలజీని వాడుకుని అడ్డదారుల్లో డబ్బు కొల్లగొడుతున్న ఓ సైబర్ నేరగాడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఓ వైద్యుడి నుంచి రూ.1.23 కోట్లు కొట్టేసిన అతగాడిని పోలీసులు అరెస్టు చేశారు. పెరిగిన టెక్నాలజీతో ప్రతిరోజూ ఈ తరహ మోసాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. అయితే.. ఏదీ ఎంతకాలం ఆగదుగా.. పాపం పండి చివరకు జైలు జీవితాన్ని గడుపుతున్నారు.
WhatsApp Photo scam Alert: వాట్సాప్ యూజర్లు జాగ్రత్త. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ అకౌంట్లపై కన్నేసారు. మీరు అలవాటు ప్రకారం తెలియక ఇలా చేశారంటే మాత్రం ఫోన్ క్షణాల్లో హ్యాక్ అయిపోయి బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయిపోతాయి. యూజర్ల స్కామర్ల చేతికి చిక్కకూడదంటే వెంటనే ఇలా చేయాలని టెలికాం శాఖ అధికారులు సూచిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు కొత్త పద్దతులు వెతుక్కుంటున్నారు. పెరిగిన టెక్నాలజీనా వాడుకుంటూ పలువురిని బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఈ తరహ మోసాలు జరగడం, పలువురు లక్షల్లో నష్టపోవడం వంటివి జరుగుతున్నాయి.
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుడికి సైబరాబాద్ సైబర్ క్రైం అధికారులు అండగా నిలిచారు. రూ.20.90 లక్షలు పెట్టుబడి పెట్టించి క్రిప్టో కరెన్సీ కొనేలా చేశారు. అయితే.. ఈ మొత్తాన్ని తిరిగి రప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సైబర్ నేరగాళ్లు రూటు మార్చి రెచ్చిపోతున్నారు. వాట్సాప్ ద్వారా మెసెజ్‌లు పెడుతూ.. బురిడీ కొట్టేస్తున్నారు. ఈ మెసజ్లకు స్పందిస్తే.. ఇక అంతే సంగతులు. మన బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకోవడం ద్వారా డబ్బులన్నీ లాగేసుకుంటున్నారు. ఈ నయా దందాకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
Fraud Case: వృద్ధురాలి పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఆమెను నమ్మించి కోట్లు కాజేశాడు. చివరకు మోసపోయానని గుర్తించిన వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది.
ఇన్స్టాగ్రామ్ లింక్‌పై నమ్మి రూ.2.46 కోట్లు కోల్పోయిన మహిళ కేసులో ఏడుగురు సైబర్ నేరగాళ్లను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు.తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందాలని మోసగాళ్లు నమ్మించి మోసం చేశారు.
సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఆన్లైన్లో అవకాడోలు బుక్ చేసిన వ్యక్తిని మాయ చేసి సైబర్ నేరగాళ్లు రూ.2.60 లక్షలు కొల్లగొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్సటికే ఎన్నో అక్రమార్గాలను ఎంచుకుని బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలన కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు తాజాగా మరో కొత్త ప్లాన్ తో రూ.2.60 లక్షలు దోచేశారు.