Account Hacked: మీ అకౌంట్ హ్యాక్ అయిందా.. ఇలా ఈజీగా తెలుసుకోండి..
ABN , Publish Date - Jul 03 , 2025 | 09:46 PM
ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ వృద్ధితో పాటు మోసాల రేటు కూడా వేగంగా పెరుగుతోంది. ఆన్లైన్ సేవల వాడకంలో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, అదే సమయంలో సైబర్ మోసాల ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో మీ అకౌంట్ హ్యాక్ అయిందా (Account Hacked) లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

డిజిటల్ వినియోగం పుంజుకున్న తర్వాత సైబర్ మోసాలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. హ్యాకర్లు కొత్త కొత్త మార్గాల్లో మన అకౌంట్‌లను హ్యాక్ చేసేందుకు (Account Hacked) ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి క్రమంలో మీ ఇమెయిల్ లేదా సోషల్ మీడియా అకౌంట్‌లు సురక్షితంగా ఉండాలంటే మాత్రం బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ అకౌంట్ హ్యాక్ అయిందేమోనని మీరు ఆందోళన చెందుతున్నారా. అయితే పలు రకాల టూల్స్ ద్వారా, మీ అకౌంట్ సురక్షితంగా ఉందో లేదా ఈజీగా తెలుసుకోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
గూగుల్ పాస్‌వర్డ్ చెకప్
మీరు ఎప్పుడైనా క్రోమ్ బ్రౌజర్‌లో లేదా మీ గూగుల్ అకౌంట్‌లో పాస్‌వర్డ్‌ను సేవ్ చేసుకున్నట్లయితే, ఈ టూల్ మీ పాస్‌వర్డ్ లీక్ అయిందా లేదా బలహీనంగా ఉందా అనే విషయాన్ని తెలియజేస్తుంది. మీ పాస్‌వర్డ్‌కు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే వెంటనే మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. ఒకే పాస్‌వర్డ్‌ను పదేపదే ఉపయోగించారా లేదా బలహీనమైన పాస్‌వర్డ్ ఉందా అని చెక్ చేస్తుంది. ఈ టూల్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ మీ అకౌంట్‌ను నిరంతరం పర్యవేక్షిస్తుంది.
గూగుల్ వన్ డార్క్ వెబ్ రిపోర్ట్
ఈ టూల్ మీ ఇమెయిల్, ఫోన్ నంబర్ లేదా పాస్‌వర్డ్‌లు డార్క్ వెబ్‌లో లీక్ అయ్యాయా అని తనిఖీ చేస్తుంది. డార్క్ వెబ్ ఫోరమ్‌లు, డేటాబేస్‌లలో మీ సమాచారం ఉందా లేదా అని పరిశీలిస్తుంది. ఇమెయిల్ నుంచి మొబైల్ నంబర్ వరకు అన్ని రకాల సమాచారాన్ని ట్రాక్ చేస్తుంది. దీనిని ఉపయోగించడానికి గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ అవసరం. అయితే ట్రయల్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ టూల్ మీ వ్యక్తిగత సమాచారం ఎక్కడైనా లీక్ అయితే, మిమ్మల్ని వెంటనే అప్రమత్తం చేస్తుంది.
ఆపిల్ ఐక్లౌడ్ కీచైన్ పాస్‌వర్డ్ మానిటరింగ్
మీరు ఐఫోన్ లేదా మాక్ యూజర్ అయితే, ఈ ఫీచర్ మీ సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను పర్యవేక్షిస్తుంది. ఏదైనా సమస్య ఉంటే హెచ్చరిస్తుంది. ఐఓఎస్, మాక్‌ఓఎస్ రెండింటిలోనూ పనిచేస్తుంది. బలహీనమైన, పునర్వినియోగించిన లేదా లీక్ అయిన పాస్‌వర్డ్‌లను గుర్తిస్తుంది. మీ అకౌంట్‌లను సురక్షితంగా ఉంచేందుకు బలమైన పాస్‌వర్డ్‌లను సూచిస్తుంది. ఈ ఫీచర్ ఆపిల్ యూజర్‌లకు సులభమైన, సమర్థవంతమైన భద్రతా పరిష్కారంగా నిలుస్తుంది.
మీ అకౌంట్‌ను హ్యాకింగ్ నుంచి ఎలా రక్షించుకోవాలి
బలమైన, యూనిక్ పాస్‌వర్డ్‌లు: ప్రతి అకౌంట్‌కు విభిన్నమైన కనీసం 12 అక్షరాల పొడవైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి
టూ-ఫాక్టర్ ఆథెంటికేషన్ (2FA): ఈ అదనపు భద్రతా ద్వారా అనధికార యాక్సెస్‌ను నిరోధించవచ్చు
లాగిన్ హిస్టరీని తనిఖీ చేయండి: మీ అకౌంట్‌కు కనెక్ట్ అయిన డివైస్‌లు, లాగిన్ హిస్టరీని క్రమం తప్పకుండా సమీక్షించండి
రికవరీ డిటైల్స్ అప్‌డేట్: మీ రికవరీ ఇమెయిల్, ఫోన్ నంబర్‌ను ఎల్లప్పుడూ అప్‌డేట్ చేసుకోండి
అసాధారణ యాక్టివిటీ: ఏదైనా అసాధారణ యాక్టివిటీ అనిపిస్తే, వెంటనే సంబంధిత వెబ్‌సైట్ లేదా యాప్‌ల పాస్‌వర్డ్‌ను మార్చుకోండి
ఇవి కూడా చదవండి
చమురు తీసుకుంటే భారత్‌పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి