Home » Cyber attack
మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అంటూ ఓ వృద్ధుడిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) అతడి వద్ద రూ. 1.50 లక్షలు కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత(DCP Dhara Kavitha) తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన 60 ఏళ్ల వృద్ధునికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది.
వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న నైజీరియన్లను(Nigerians) తిరిగి వారి దేశాలకు పంపించాలని పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు.
ఇన్సూరెన్స్ పాలసీ(Insurance policy)కి చెందిన డబ్బులు ఖాతాలో జమ చేస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.5.81 లక్షలు కాజేశారు. సికింద్రాబాద్(Secunderabad)కు చెందిన ప్రైవేటు ఉద్యోగి (58)కి పలు సంస్థల ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి.
ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్న సైబర్ మోసాలపై అదే వేదిక ద్వారా ప్రజలకు అవగాహన కలిగించి కట్టడి చేయాలని పోలీసులు సరికొత్త కార్యాచరణ మొదలు పెట్టారు. పేరొందిన సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల(Social media influencers)ను ఇందులో భాగస్వామ్యం చేస్తూ వారితో ప్రచారం చేయిస్తున్నారు.
సింగపూర్, యూకే(Singapore, UK)లో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని వీసా ప్రాసెసింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన యువకుడి నుంచి రూ. 2లక్షలు దోచేశారు.
డిజిటల్ అరెస్టుల పేరుతో ఇద్దరి నుంచి రూ.1.66 కోట్ల మేర తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్న ఏడుగురిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు(Cyberabad Cyber Crime Police) అరెస్ట్ చేశారు.
అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ అత్యంత ప్రధానమైనది. దాపు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్ వినియోగిస్తున్నారు. ఆఫీస్, పర్సనల్ అన్నింటికీ వాట్సాప్‌పైనే ఆధారపడుతున్నారు. అందుకే సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు వాట్సాప్ పైన ఫోకస్ పెట్టారు. కొత్త రకం స్పైవేర్ ద్వారా వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృ సంస్థ కూడా ధృవీకరించింది. సో ఈ విషయాల్లో బీ అలర్ట్..
ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) అమాయకులను నిలువునా మోసగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సోలార్ ప్రాజెక్టుకు రుణం ఇప్పిస్తానని చెప్పి సైబర్ నేరగాడు నగరానికి చెందిన ఓ మహిళకు కుచ్చుటోపీ వేశాడు.
తాను ఆర్మీ కల్నల్‌ను అని, మెడికల్ సర్టిఫికెట్లు కావాలని వైద్యురాలిని సంప్రదించిన సైబర్ నేరగాడు(Cyber criminal) రూ.1.40 లక్షలు కొల్లగొట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన ఓ వైద్యురాలికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది.
సైబర్ నేరగాళ్లు రోజుకో సరికొత్త మార్గం ఎంచుకుంటున్నారు. ఆన్‌లైన్ మోసాలు,డిజిటల్ అరెస్ట్‌లకు పోలీసులు బ్రేక్ వేస్తుండటంతో ఇప్పుడు కొత్తగా జంప్ డిపాజిట్ అంటున్నారు.