Home » Crime
పోక్సో కేసులో అన్నమయ్య జిల్లా యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం తీర్పు చెప్పింది.
పదేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన చిత్తూరు ప్రథమ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్యకేసు విచారణ చివరి ఘట్టానికి చేరుకుంది. శుక్రవారం న్యాయమూర్తి తుది తీర్పు వెల్లడించనున్నారు.
పేదలకు చెందాల్సిన ఉచిత రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. పాలిష్ చేసి మార్కెట్లో అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనికి చెక్‌పెట్టే దిశగా ప్రభుత్వం అత్యాధునిక విధానానికి శ్రీకారం చుట్టింది.
ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఓ గ్రామంలో మద్యం మత్తులో తన 12 ఏళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం చేశాడు. బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లి ఒంగోలులోని ఆసుపత్రికి తీసుకొచ్చింది.
బాలీవుడ్ సినిమా 'ధూమ్' స్టైల్‌లో ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో భారీ దొంగతనం సంచలనంగా మారింది. మ్యూజియంలోకి చొరబడిన దొంగలు క్షణాల్లోనే ఆభరణాలను చోరీ చేశారు. దీంతో పారిస్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
చాదర్‌ఘాట్‌లో పోలీసులపై మొబైల్ స్నాచర్లు కత్తితో దాడికి యత్నం చేశారని డీజీపీ తెలిపారు. సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడే వారిని పట్టుకునే క్రమంలో నిందితులు కత్తితో దాడి చేశారని.. డీసీపీ చైతన్య కుమార్, గన్ మెన్ మూర్తి 750 మీటర్లు వెంబడించి నిందితులను చేజ్ చేశారని తెలిపారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద వేగంగా వస్తున్న ఎక్స్ప్రెస్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు సైడ్ ఐరన్ భారీ గేట్లను ఢీ కొట్టింది.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఉమ్మడి జిల్లావాసులను కంటతడి పెట్టించింది. ఉదయం లేవగానే ఈ విషాదకర సంఘటన గురించి తెలుసుకుని జనం ఆవేదన చెందారు. న్యూస్ చానళ్లు, సోషల్ మీడియాలో ప్రమాద దృశ్యాలను చూసి చలించిపోయారు. జాతీయ రహదారులపై ప్రైవేట్ ట్రావెల్ బస్సులలో ప్రయాణం ...
సాహితీ ఇన్‌ఫ్రా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. రూ.12.65 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఫ్రీలాంచ్ ఆఫర్ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రా మోసం చేసినట్లు గుర్తించిన అధికారులు.. కంపెనీ డైరెక్టర్ పూర్ణచందర్‌రావుతో పాటు కుటుంబ సభ్యులపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
తన చావుకు పోలీస్ అధికారి, ఎస్సై గోపాల్ బద్నే కారణమంటూ మహిళా డాక్టర్ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఫల్టాన్ లో ఒక హోటల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.