Husbend Attack on Wife: ఏపీలో ఘోరం.. భార్యను హత్య చేసిన భర్త
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:44 PM
కాకినాడ జిల్లా యానాంలో మంగళవారం దారుణ హత్య జరిగింది. స్థానిక బల్లవారి వీధిలో ఓ ఇంట్లో అద్దెకుంటున్న భార్య పెమ్మాడి దీనా(26)ను భర్త నాని హత్య చేశాడు.
కాకినాడ, నవంబర్ 4: ఆంధ్ర ప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా యానాంలో మంగళవారం దారుణ హత్య జరిగింది. స్థానిక బల్లవారి వీధిలో ఓ ఇంట్లో అద్దెకుంటున్న భార్య పెమ్మాడి దీనా(26)ను భర్త నాని హత్య చేశాడు. గుత్తెనదివి గ్రామానికి చెందిన వీరు గత నాలుగు నెలలగా బల్లవారి వీధిలో అద్దెకు ఉంటున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన భర్త.. తన భార్యను దారుణంగా చంపాడు.
దీనా శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో ఆమెను యానాం ప్రభుత్వ ఆసుపత్రితరలించారు. ఈ క్రమంలోనే ఆమె మృతి చెందింది. దీనా మృతదేహాన్ని మార్చరీకి తరలించారు. భర్త నాని పరారీలో ఉన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన యానాం ఎస్పీ వరదరాజాన్.. క్లూస్ టీంతో వివరాలు సేకరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. గోవాలో నకిలీ మద్యం డంప్
Srivaru Donation: శ్రీవారికి విరాళంగా వెండి గంగాళం.. ఎంత ఖరీదంటే