Share News

Road Accident: ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Nov 04 , 2025 | 07:11 AM

శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని దామాజిపల్లి వద్దగల 44వ జాతీయ రహదారిపై ఐచర్ వాహనాన్ని ఢీ కొని జబ్బర్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి.

Road Accident: ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం
Road Accident

చెన్నేకొత్తపల్లి, నవంబర్ 4: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని దామాజిపల్లి వద్దగల 44వ జాతీయ రహదారిపై ఐచర్ వాహనాన్ని ఢీ కొని జబ్బర్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బెంగలూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో జబ్బర్ ట్రావెల్స్ బస్సు (NL 01B 3382) ఐచర్ వాహనాన్ని బస్సు ఢీ కొట్టి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

Electricity Department: అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు

AP Assembly House Committee: వైసీపీ హయాంలో అవినీతిపై 17లోగా నివేదిక

Updated Date - Nov 04 , 2025 | 07:25 AM