Hidden cameras: మహిళల వాష్ రూముల్లో సీసీటీవీ కెమెరాలు.. ప్రైవేట్ వీడియోలు పంపించి వ్యాపారం
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:14 PM
స్నానాల గదుల్లో గుర్తు తెలియని వ్యక్తులు రహస్య కెమెరాలు అమర్చినట్లు తేలడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. కొందరు వ్యక్తులు.. మహిళలు స్నానాలు చేస్తున్న వీడియోలను క్యాష్ చేసుకొని డబ్బులు కొల్లగొడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
తమిళనాడు, నవంబర్ 6: వాష్ రూముల్లో సీసీ కెమెరాలు అమర్చినట్లు తేలడంతో ఒక్కసారిగా మహిళలు ఉలిక్కిపడ్డ ఘటన తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో జరిగింది. స్నానాలు చేస్తున్న వీడియోలు తీసి విక్రయించి వ్యాపారం చేస్తున్నారని అనుమానం రావడంతో మహిళలు షాక్ గురయ్యారు. సెల్ ఫోన్ తయరీ సంస్థలో జరిగిన ఈ ఘటనపై మహిళలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తమిళనాడు పరిధిలో డెంకణీకోట పట్టణానికి దగ్గరలో నాగమంగలంలో విస్తరించిన సెల్ ఫోన్ తయారీ కంపెనీలో వేలమంది మహిళలు పనిచేస్తున్నారు. అందులో రెండువేల మంది ఉండడానికి వీలైన ఓ వసతిగృహం ఉంది. ఆ హాస్టల్ లోని స్నానాల గదుల్లో గుర్తుతెలియని వ్యక్తులు రహస్య కెమెరాలు (Hidden cameras in wash rooms) అమర్చినట్లు తేలడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. కొందరు వ్యక్తులు.. మహిళలు స్నానాలు చేస్తున్న వీడియోలను క్యాష్ చేసుకొని డబ్బులు కొల్లగొడుతున్నారని అనుమానాలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న మహిళలు వెంటనే అప్రమత్తమై మంగళవారం సాయంత్రమే అక్కడినుంచి వెళ్లిపోయారు. విధులు ముగించుకుని వచ్చినవారంతా ఈ విషయం గురించి ప్రశ్నించగా ఈ విషయం బయటికి వచ్చింది.
ఈ దుశ్చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు.. ఏకంగా ధర్నాకు దిగారు. అర్ధరాత్రి వరకు చేసిన ఈ ఆందోళన తీవ్రతరమైంది. మహిళల వాష్ రూముల్లో సీసీటీవీ కెమెరా అమర్చడం ఏంటి? అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన దుర్మార్గులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కృష్ణగిరి జిల్లా ఎస్పీ తంగదురై, డెంకణీకోట డీఎస్పీ ఆనందరాజ్, సీఐ శంకర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని మహిళలకు నచ్చజెప్పినా వారు ఎంత మాత్రం వినలేదు. తమకు న్యాయం చేయాల్సిందేనని పట్టుబట్టారు.
ఒడిశాకు చెందిన నీలకుమారి అనే మహిళే వాష్ రూముల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చినట్లు గుర్తించారు. మహిళల స్నానం చేస్తున్న వీడియోలను బెంగళూరులో సంతోశ్ అనే వ్యక్తికి పంపించి, చేస్తోందని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పోలీసులు నీలకుమారిని అరెస్టు చేసి జైలుకి తరలించారు. అనంతరం మహిళా ఉద్యోగులు ఆందోళన విరమించారు. పోలీసులు ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Welfare Schemes: రూ.1.68 లక్షల కోట్ల మహిళా పథకాలు
PM Modi-Bihar Election: కంగ్రాట్స్ యంగ్ స్టర్స్.. మొదట ఓటు, తరువాత రిఫ్రెష్‌మెంట్: ప్రధాని మోదీ