Share News

Welfare Schemes: రూ.1.68 లక్షల కోట్ల మహిళా పథకాలు

ABN , Publish Date - Nov 06 , 2025 | 06:59 AM

మహిళలు కేంద్రంగా అమలు చేస్తున్న నగదు బదిలీ (యూసీటీ) పథకాలతో రాష్ట్రాల ఆర్థికవ్యవస్థలు.....

Welfare Schemes: రూ.1.68 లక్షల కోట్ల మహిళా పథకాలు

  • ప్రస్తుత బడ్జెట్‌లో 12 రాష్ట్రాలు చేయనున్న భారీ ఖర్చు ఇది

  • మహిళల సంక్షేమ ఖర్చే అత్యధికం.. అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ, నవంబరు 5: మహిళలు కేంద్రంగా అమలు చేస్తున్న నగదు బదిలీ (యూసీటీ) పథకాలతో రాష్ట్రాల ఆర్థికవ్యవస్థలు కుదేలవుతున్నాయని, మిగులులో ఉండే రాష్ట్రాల రెవెన్యూ కాస్తా లోటులోకి జారిపోతోందని ఓ అధ్యయనంలో తేలింది. మూడేళ్ల క్రితం రెండు రాష్ట్రాలకే పరిమితమైన ఈ తరహా పథకాల అమలు ఇప్పుడు 12 రాష్ట్రాలకు విస్తరించిందని, ప్రస్తుత బడ్జెట్‌లో ఈ రాష్ట్రాలు మొత్తం రూ.1.68 లక్షల కోట్లు (1.68 ట్రిలియన్లు) దీనికోసం వెచ్చించనున్నాయని పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ పథకాలను అమలుచేస్తున్నవాటిలో ఆరు రాష్ట్రాలు ఈ ఏడాది రెవెన్యూలోటును నమోదు చేశాయని చెబుతూ.. పెరిగిన యూసీటీల విస్తృతి ఆర్థిక వ్యవస్థకు పెను భారంగా మారిందనేందుకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించింది.

Updated Date - Nov 06 , 2025 | 06:59 AM