PM Modi-Bihar Election: కంగ్రాట్స్ యంగ్ స్టర్స్.. మొదట ఓటు, తరువాత రిఫ్రెష్‌మెంట్: ప్రధాని మోదీ
ABN , Publish Date - Nov 06 , 2025 | 08:30 AM
బీహార్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఈ ఉదయం మొదలైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఓటు వేస్తున్న ఓటర్లకు కీలక సందేశం ఇచ్చారు. ముందుగా శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ, నవంబర్ 6: బీహార్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఈ ఉదయం మొదలైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక సందేశం ఇచ్చారు. ముఖ్యంగా తొలిసారి ఓటువేస్తున్న యువతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ.. మొదట ఓటు, తర్వాతే ఇతర పనులు అంటూ ప్రధాని యువతకు సూచించారు.
'బీహార్ ప్రజాస్వామ్య వేడుకల్లో ఈ రోజు మొదటి దశ. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అందరు ఓటర్లు పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా, తొలిసారి ఓటు వేస్తున్న రాష్ట్రంలోని నా యువ స్నేహితులందరికీ నా ప్రత్యేక అభినందనలు. గుర్తుంచుకోండి: మొదట ఓటు, తరువాత రిఫ్రెష్‌మెంట్‌లు!' అని ప్రధాని అన్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
Alcohol Sales: ఎక్సైజ్ శాఖకు.. ఒక్క నెలలోనే భారీగా ఆదాయం..
Highway After Deadly Accident: ఎట్టకేలకు రోడ్డు విస్తరణ షురూ