Home » Crime News
హైదరాబాద్ చర్లపల్లి పీఎస్ పరిధిలో మృతదేహం కలకలం రేపుతోంది. రైల్వేస్టేషన్ సమీపంలో మహిళ మృతదేహం గోనె సంచిలో లభ్యమైంది.
విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్ కటకటాలపాలయ్యాడు. తిరుచ్చి కేకే నగర్‌కు చెందిన తమిళ్ (52) తిరుచ్చిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు.
వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ పరిధిలోని అగ్రహారం వెంచర్ వద్ద దారుణం జరిగింది. కారులో రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ కౌన్సిలర్ రమేష్(48)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు.
హైదరాబాద్, కుషాయిగూడ పరిధిలోని రాధిక థియేటర్ సమీపంలో భార్య గొంతు కోసి హత్య చేశాడు ఓ భర్త. భార్య బంధువుల ఇంట్లో ఉన్న సమయంలో హత్య చేసి.. భర్త పరారయ్యాడు.
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ టైరు పగిలి ఇన్నోవా కారు బోల్తా పడిన సంఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మండల కేంద్రమైన చౌటకూర్(Chautakur)కు సమీపంలో సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది.
వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ సోదరుడు సమీర్ మోదీ అరెస్ట్ అయ్యారు. అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు ఆయన్ను గురువారం సాయంత్రం ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
ఆమె జోలపాట పాడి తన మూడేళ్ల కూతురిని నిద్రపుచ్చింది. నిద్రపోతున్న బిడ్డను తీసుకుని సరస్సు దగ్గరకు వాకింగ్‌కు వెళ్లింది. ఎవరూ లేని సమయం చూసి ఆ చిన్నారిని సరస్సులోకి విసిరేసి ఏమీ తెలియనట్టు కూర్చుంది. అనంతరం తన కూతురు తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కుప్పం మండలం బైరప్ప కొట్టాలలో భార్యను అతికిరాతకంగా కత్తితో నరికాడు ఓ భర్త. బైరప్ప కొట్టాలు గ్రామానికి చెందిన కీర్తనకు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లె సమీపంలోని తీర్థం గ్రామానికి చెందిన రాజేష్‌కు సుమారు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది.
ర్యాగింగ్ చేయడం, తోటి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం నేరమని తెలిసినా పోలీసులు పదే పదే హెచ్చిరిస్తున్నా విద్యార్థుల్లో మార్పు రావడం లేదు. తాజాగా, హైదరాబాద్ నగరంలోని ఓ స్కూల్లో పుట్టిన రోజు ర్యాగింగ్ పేరుతో 9వ తరగతి విద్యార్థిని చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది.
రోటరీపురం సమీపంలోని ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ తృతీయ సంవత్సరం విద్యార్థిని కె. ధనలక్ష్మి(21) ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ హాస్టల్ గదిలో మంగళవారం ఉరి వేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, పెనుకొండ పట్టణంలోని ఒగ్గప్ప కుంట కాలనీకి చెందిన నాగరాజు కూతురు ధనలక్ష్మి.