Share News

TVS XL: టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌లే లక్ష్యం..

ABN , Publish Date - Nov 12 , 2025 | 09:20 AM

లాల్‌దర్వాజ ఛత్రినాకకు చెందిన షకత్‌వారి శ్రవణ్‌ (28) పాత దొంగ. అల్లం, వెల్లుల్లిగడ్డల వ్యాపారం చేస్తున్నాడు. తన స్నేహితులైన బీబీనగర్‌కు చెందిన కాలియారాజు, మేడ్చల్‌కు చెందిన షకత్‌ ముఖేంద్రతో కలిసి సులభంగా డబ్బుల సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనాలు చోరీ చేస్తే యజమానులు కూడా చిన్న వాహనం అని ఫిర్యాదు చేసే అవకాశం ఉండదని భావించి ఆ వాహనాలను చోరీచేస్తున్నారు.

TVS XL: టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌లే లక్ష్యం..

-19 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

- చోరీలు చేస్తున్న ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్: ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న ముగ్గురిని అంబర్‌పేట పోలీసులు(Amberpet Police) అరెస్ట్‌ చేశారు. వారి నుంచి సుమారు రూ. 15 లక్షల విలువైన 19 టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్‌ డీసీపీ డాక్టర్‌ బి. బాలస్వామి వివరాలు వెల్లడించారు.

లాల్‌దర్వాజ ఛత్రినాకకు చెందిన షకత్‌వారి శ్రవణ్‌ (28) పాత దొంగ. అల్లం, వెల్లుల్లిగడ్డల వ్యాపారం చేస్తున్నాడు. తన స్నేహితులైన బీబీనగర్‌కు చెందిన కాలియారాజు, మేడ్చల్‌కు చెందిన షకత్‌ ముఖేంద్రతో కలిసి సులభంగా డబ్బుల సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.


టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌(TVS XL) వాహనాలు చోరీ చేస్తే యజమానులు కూడా చిన్న వాహనం అని ఫిర్యాదు చేసే అవకాశం ఉండదని భావించి ఆ వాహనాలను చోరీచేస్తున్నారు. ప్రధాన నిందితుడు షకత్‌వారి శ్రవణ్‌ గతంలో అఫ్జల్‌గంజ్‌, బాలానగర్‌ పీఎస్‌ పరిధిలో దొంగతనం చేసి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత మొదటి భార్యకు విడాకులు ఇచ్చి శాంతి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఉప్పల్‌బీరప్పగడ్డలో నివసిస్తూ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు.


స్నేహితులతో కలిసి అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లో ఈనెల 7వ తేదీన జి. రాజశేఖర్‌ ఇంటి ఎదుట పార్క్‌ చేసిన టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనాన్ని చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీన అలీకేఫ్‌ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. శ్రవణ్‌, రాజు, ముఖేంద్ర అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించారు.


city5.jpg

వీరు అంబర్‌పేట, కాచిగూడ, ఛత్రినాకలో ఒక్కొక్కటి, ఉప్పల్‌లో 9, నేరేడ్‌మెట్‌లో 2, శామీర్‌పేటలో 2, కుషాయిగూడలో 2, అల్వాల్‌ పీఎ్‌సలో ఒక వాహనాన్ని చోరీ చేశారు. దొంగిలించిన వాహనాలను గ్రామాల్లో తక్కువ ధరకు విక్రయించేవారు. పోలీసులు వారి నుంచి 19 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్‌ అడిషనల్‌ డీసీపీ జోగుల నర్సయ్య, కాచిగూడ ఏసీపీ వై.హరీష్ కుమార్‌, అంబర్‌పేట సీఐ కిరణ్‌కుమార్‌, డీఐ హఫీజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హాయ్‌ల్యాండ్‌కు గ్రూప్‌-1 పత్రాల తరలింపుపై రికార్డుల్లేవ్‌

తిరుమల లడ్డూ మిఠాయి కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 12 , 2025 | 09:20 AM