Share News

Hyderabad: గదిలో నిర్బంధించి.. మూకుమ్మడి దాడి

ABN , Publish Date - Nov 11 , 2025 | 08:39 AM

అమ్మేసిన ఇంట్లోనే అక్రమంగా ఉంటూ ఆ ఇంటి యజమాని కుమారుడినే నిర్బంధించి ఇనుపరాడ్లతో చితకబాదిన సంఘటన జూబ్లీహిల్స్‌లో సోమవారం జరిగింది. తీవ్రగాయాలపాలైన బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad: గదిలో నిర్బంధించి.. మూకుమ్మడి దాడి

- యువకుడికి తీవ్రగాయాలు

- మహిళ, ఆమె తల్లి, రిపోర్టర్‌పై కేసు

హైదరాబాద్: అమ్మేసిన ఇంట్లోనే అక్రమంగా ఉంటూ ఆ ఇంటి యజమాని కుమారుడినే నిర్బంధించి ఇనుపరాడ్లతో చితకబాదిన సంఘటన జూబ్లీహిల్స్‌లో సోమవారం జరిగింది. తీవ్రగాయాలపాలైన బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12 హుడా హైట్స్‌(Banjara Hills Road No. 12 Huda Heights)లో నివసించే సునీల్‌కుమార్‌ అహుజా వ్యాపారవేత్త. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 25లో పోలవరపు శ్రీదేవి కుటుంబ సభ్యుల నుంచి దాదాపు 764 చదరపు గజాల ఇంటితో కూడిన స్థలాన్ని 2009లో రూ.5కోట్లు చెల్లించి కొనుగోలు చేశాడు.


నాటినుంచి ఆ ఇళ్లు అతని ఆధీనంలోనే ఉంది. ఈ నెల 9న అతని కుమారుడు ఆశి్‌షకుమార్‌ అహూజా, తన స్నేహితుడైన ఇమ్రాన్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఇంటికి వెళ్లాడు. ఇంట్లో గుర్తుతెలియని వారు ఉండటంతో ఆశిష్‌ ఆశ్చర్యపోయాడు. మీరంతా ఎవరూ అంటూ ప్రశ్నించారు. అదే సమయంలో విధు ల్లో భాగంగా ఓ చానెల్‌ రిపోర్టర్‌ సాగర్‌(Sagar) కూడా అక్కడకు చేరుకొని ఆశి్‌షను ఇంటి పత్రాలు చూపించాలని దబాయించాడు. ఇంతలో పోలవరపు శ్రీదేవి, ఆమె తల్లి వరలక్ష్మి అక్కడకు వచ్చారు.


city5.2.jpg

అందరూ కలిసి ఆశిష్‌ కుమార్‌, ఇమ్రాన్‌లను బలవంతంగా గదిలో నిర్భందించి ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేశారు. తప్పించుకొనే సమయంలో ఆశి్‌షకుమార్‌ తల, నడుము భాగం లో తీవ్ర గాయాలయ్యాయి. ఐవాచ్‌, ఐఫోన్‌లను వారు లాక్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు శ్రీదేవి, వరలక్ష్మి, రిపోర్టర్‌ సాగర్‌లపై కేసులు నమోదు చేశారు. శ్రీదేవి అతని కుమారుడిపై గతంలో కూడా జూబ్లీహిల్స్‌ పోలీసులు ఓ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 11 , 2025 | 08:39 AM