Share News

Hyderabad: అర్ధరాత్రి రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్‌..

ABN , Publish Date - Nov 12 , 2025 | 07:17 AM

నిజాంపేట కార్పొరేషన్‌ రాజీవ్‌గృహకల్పలో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది. ఆటోలో వస్తున్న ఇద్దరిపై దాడి చేసి తలలు పగులగొట్టింది. బాచుపల్లి పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: అర్ధరాత్రి రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్‌..

- యువకుల పరస్పర దాడి

- ఇద్దరికి తీవ్ర గాయాలు

- పోలీసుల అదుపులో గ్యాంగ్‌ లీడర్‌

హైదరాబాద్: నిజాంపేట కార్పొరేషన్‌ రాజీవ్‌గృహకల్ప(Nizampet Corporation Rajiv Gruha Kalpa)లో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది. ఆటోలో వస్తున్న ఇద్దరిపై దాడి చేసి తలలు పగులగొట్టింది. బాచుపల్లి పోలీసుల కథనం ప్రకారం... సోమవారం రాత్రి 11 గంటలకు తరుణ్‌ నాయక్‌, సీతారామ్‌ నాయక్‌లు ఆటో నడుపుకుంటూ తమ ఇంటికి వస్తుండగా, అప్పటికే గంజాయి, మద్యం తాగి మత్తులో ఉన్న తిలక్‌తో పాటు అతని గ్యాంగ్‌ సభ్యులు ముగ్గురు ఆటోను ఆపారు. మమ్మల్నే పక్కకు పొమ్మటారా అంటూ దాడికి దిగారు.


ఎదురు దాడి చేసి తరుణ్‌ నాయక్‌, సీతారామ్‌ నాయక్‌ తలలను పగులగొట్టారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడు తిలక్‌ను అదుపులోకి తీసుకొని, అతడికి సహకరించిన మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాచుపల్లి పోలీసులు(Bachupalli Police) తెలిపారు.


city2.jpg

బెదిరింపులకు పాల్పడుతున్న గ్యాంగ్‌..

రాజీవ్‌గృహకల్పలో 80వ బ్లాక్‌ మొదలుకొని అన్ని బ్లాక్‌లకు తిలక్‌ అనే వ్యక్తికి సంబంధించిన గ్యాంగ్‌ సభ్యులు రాత్రి వేళల్లో గంజాయి విక్రయించడంతో పాటు సేవిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. ఎవరైనా అడ్డు చెబితే నీ అంతు చేస్తామని, ఇళ్లలోకి వచ్చి కొడతామని బెదిరిస్తున్నారని, వీరిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు రామచంద్రనాయక్‌ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.


వీరి బెదిరింపులతో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని జీవిస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్న, చిన్న యువకులను బెదించి గంజాయి అలవాటు చేయిస్తున్నారని, పరిస్ధితి ఇలాగే కొనసాగితే మున్ముందు కాలనీలో ప్రజలు నివసించేందుకు కష్టతరమవుతుందని రామచంద్రనాయక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించి, స్ధానికులకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హాయ్‌ల్యాండ్‌కు గ్రూప్‌-1 పత్రాల తరలింపుపై రికార్డుల్లేవ్‌

తిరుమల లడ్డూ మిఠాయి కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 12 , 2025 | 07:17 AM