Share News

AP News: ప్రమేయం లేని చోరీ కేసుల్లో తన పేరు ప్రస్తావిస్తున్నాడనే హత్య..

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:51 PM

తన ప్రమేయం లేని చోరీ కేసుల్లో పోలీసులు వద్ద తన పేరు ప్రస్తావిస్తున్నాడనే కోపంతో మనోజ్‌ను హత్య చేశానని హరిప్రసాద్‌ విచారణలో చెప్పినట్టు అదనపు ఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు.

AP News: ప్రమేయం లేని చోరీ కేసుల్లో తన పేరు ప్రస్తావిస్తున్నాడనే హత్య..

రేణిగుంట(తిరుపతి): తన ప్రమేయం లేని చోరీ కేసుల్లో పోలీసులు వద్ద తన పేరు ప్రస్తావిస్తున్నాడనే కోపంతో మనోజ్‌(Manoj)ను హత్య చేశానని హరిప్రసాద్‌ విచారణలో చెప్పినట్టు అదనపు ఎస్పీ రవిమనోహరాచారి(SP Ravimanoharachary) తెలిపారు. సోమవారం గాజులమండ్యం పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ వివవరాలు వెల్లడించారు. ఈనెల 2న ఆదివారం మద్యం దుకాణం సమీపంలో జరిగిన హత్య కేసులో వేలిముద్రలఆధారంగా మృతుడిని మనోజ్‌గా గుర్తించామన్నారు.


డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టామన్నారు. రేణిగుంటలో నివాసం ఉంటున్న మనోజ్‌, హరిప్రసాద్‌( కలసి చోరీలు చేసేవారని, ఈ క్రమంలో వారు జైలు శిక్షకు అనుభవించారన్నారు. ఆ తర్వాత హరిప్రసాద్‌ పెయింటింగ్‌ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని తెలిపారు. అయితే కొన్ని చోరీ కేసుల్లో ప్రమేయం లేకున్నా మనోజ్‌ పోలీసులు వద్ద తన పేరు చెబుతుండడంతో హరిప్రసాద్‌ పగ పెంచుకున్నాడన్నారు. అలాగే ఇటీవల హరిప్రసాద్‌ కాళ్లకు గాయమై నడవలేని స్థితికి చేరుకున్నాడన్నారు.


దీనిపై హరిప్రసాద్‌సహా అతని భార్యపై మనోజ్‌ తప్పుడువ్యాఖ్యలు చేశాడన్నారు. దీంతో మరింత పగ పెంచుకున్న హరిప్రసాద్‌ ఎలాగైనా మనోజ్‌ను అంతమొందించాలనుకున్నాడని చెప్పారు. తన తమ్ముడు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన సుధాకర్‌, రేణిగుంట(Renigunta) పాంచాలినగర్‌కు చెందిన మిత్రుడు శ్యాంసన్‌తో కలిసి పథకం ప్రకారం ప్లాస్టిక్‌ పట్టలు, తాళ్లు, టేప్‌ కొనుగోలు చేశారన్నారు. పెయింటింగ్‌ కాంట్రాక్ట్‌ కుదిరిందంటూ నవంబర్‌ 2వ తేదీ ఆదివారం ఉదయం లక్ష్మీనగర్‌ వద్ద ఉన్న తన ఇంటికి రావాలని మనోజ్‌ను పిలిచాడన్నారు.


pandu4.jpg

ఇంట్లోకి వచ్చిన మనోజ్‌ కాళ్లుచేతులు కట్టి నోటికి, ముక్కుకు స్టిక్కర్‌ అంటించి ఊపిరి ఆడనీయకుండా చంపి వేశారన్నారు. అనంతరం మనోజ్‌ మృతదేహాన్ని అసంపూర్ణ భవనంలోని సంపులో వేసి వెళ్లిపోయారన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం కట్ట పుట్టాలమ్మ ఆలయం వద్ద ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితులు విషయాలను వెల్లడించారన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సీఐలు మంజునాథ్‌, జయచంద్ర, ఎస్‌ఐ సుధాకర్‌, ట్రైనీ ఎస్‌ఐ ప్రవల్లిక, కానిస్టేబుళ్లకు ఎస్పీ రివార్డులను అందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 11 , 2025 | 01:51 PM