Home » Congress Govt
మాజీమంత్రి కేటీఆర్‌కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.హైడ్రాని భూతంలా చూపించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.
ఆర్మీ సరిహద్దుల్లో ఉండటం వల్లనే మనమంతా సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నాతమని కేటీఆర్ తెలిపారు. సంతోషంగా కుటుంబాలతో జీవించగలుగుతున్నామని పేర్కొన్నారు.
మణుగూరు తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించింది.
మాజీ మంత్రి కేటీఆర్.. తన సొంత చెల్లి కవితనే ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని కేటీఆర్.. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం మేలు చేస్తారు..? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అందరికీ అన్నిసార్లు అవకాశం రాకపోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
వరంగల్ నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వదలొద్దని హెచ్చరించారు. ఫ్లడ్ వాటర్ మేనేజ్‌మెంట్‌పై ఇరిగేషన్ శాఖ సంసిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వర్షాలు తగ్గాయి కాబట్టి పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని అధికారులని ఆదేశించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, మజ్లిస్ ఆడుతున్న నాటకాలని ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికలో ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని నిలదీశారు. ఒక వర్గం మెప్పు కోసం కాంగ్రెస్ చేసే ప్రయత్నం చట్ట వ్యతిరేకమని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆక్షేపించారు.
నూతన మంత్రి అజారుద్దీన్‌కి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి మంత్రివర్గంలోకి ఆహ్వానం పలికారు. ఈ మేరకు.. అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు.. మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు.
రేవంత్‌రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి పదవి కోసం ఎదురుచూసిన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావులకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం.