Home » Chennai News
అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలను ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు వినిపిస్తున్నాయి.
అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టారంటూ కొంతమంది చేస్తున్న విమర్శలను డీఎంకే నాయకురాలు కనిమొళి కొట్టిపారేశా రు. వారి మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు.
డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు.
అన్నా విశ్వవిద్యాలయంలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఓ విద్యార్థిని గురువారం సాయంత్రం చేసిన ఫిర్యాదులో వివరాలిలా ఉన్నాయి.
భారత ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 3న చెన్నై రానున్నట్లు తెలిసింది. ఆ రోజు పుదుచ్చేరి ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న మోదీని చెన్నైకికూడా రప్పించాలని ఎన్‌డీఏ నేతలు సన్నాహాలు చేపట్టారు.
తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా సరిహద్దుల్లో తెలుగు గంగ కాలువల్లో మరమ్మతుల కారణంగా నగరానికి కృష్ణా జలాల విడుదల తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెన్నై మెట్రోవాటర్ బోర్డ్ ప్రకటించింది.
డీఎంకే చిహ్నంపై పోటీ చేయాల్సి రావడం పట్ల ఎండీఎంకే నేత అర్జున్‌రాజ్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తమ చిహ్నంపై పోటీ చేయలేకపోవడం పట్ల తాము బయటకు నవ్వుతూనే వున్నా.. లోలోన ఏడుస్తున్నామన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, సెక్యూలర్ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఏప్రిల్ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని డీఎంకే ప్రధాన కార్యాలయం గురువారం ప్రకటించింది.
కాళ్ల పారాణి ఆరకముందే ఓ యువతి కన్నుమూసింది. స్థానిక ఆవడి సమీపంలో వందే భారత్ రైలు ఢీకొని యువతి మృతిచెందడంపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇటీవల తంజావూరు జిల్లా సింగిపట్టి పర్యటనకు వచ్చిన టీవీకే అధినేత విజయ్ కారు వెంట బైక్‌తో పరుగులుతీసి ప్రమాదానికి గురైన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.