Share News

N Raghuveera Reddy: రఘువీరా పిలుపు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేద్దాం

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:40 PM

తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేచయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.

N Raghuveera Reddy: రఘువీరా పిలుపు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేద్దాం

- రఘువీరారెడ్డి

చెన్నై: తమిళనాట కాంగ్రెస్‌ పార్టీ(Tamil Nadu Congress Party)ని బలోపేతం చేసేందుకు నేతలు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ ఆలిండియా వర్కింగ్‌ కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి(N Raghuveera Reddy) పిలుపునిచ్చారు. మంగళవారం ట్రిప్లికేన్‌-చేపాక్కం నియోజకవర్గ సమావేశం జరగ్గా.. వివిధ విభాగాల పునర్నిర్మాణం కోసం అభిప్రాయసేకరణ జరిగింది. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ..


nani4.2.jpg

నేతలంతా సమైక్యంగా కృషి చేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఇదిలా వుండగా ట్రిప్లికేన్‌కు చెందిన తెలుగు ప్రముఖఖులు పి.పాల్‌ కొండయ్య నేతృత్వంలో పి.చిన్నయ్య, పి.అరుణ్‌కుమార్‌ తదితరులు రఘువీరారెడ్డిని కిలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు తదితరులు పాల్గొన్నారు.


nani4.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల నిర్వహణకు డబ్బులేవి?

పట్టుబట్టి.. మంజూరు చేయించి...

Read Latest Telangana News and National News

Updated Date - Dec 03 , 2025 | 12:40 PM