Home » Chennai News
ఈసారి నేను అసెంబ్లీలో అడుగుపెట్టడం తథ్యమని, డీఎండీకే పార్టీ ఫీనిక్స్ పక్షి లాంటిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత అన్నారు. ఆమె మాట్లాడుతూ... పడిలేచిన కెరటంలా మళ్ళీ పైకొస్తుందని ఆమె అన్నారు. కొద్దిరోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చెన్నై బీచ్ స్టేషన్ నుంచి బయలుదేరనున్నాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.
ఊటీలోగల పార్కులో తొలిసారి 1,500 రకాల రోజా మొక్కలు నాటారు. ఇవి ఇక ఏడాది పొడవునా పర్యాటకులకు అహ్లదాన్ని పంచనున్నాయి. పర్యాటకులు నిరాశ చెందకుండా, రోజా పూలు చూస్తూ ఆనందించేలా, ఉద్యానవన శాఖ మొట్టమొదటి సారిగా గ్రీన్ హౌస్‌లో రోజా మొక్కలు నాటారు.
సంక్రాంతి పండుగ వల్ల ప్రయాణికులు లేకపోవడంతో ఐదు ప్రత్యేక రైళ్లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణాల నుంచి పెద్దఎత్తున తమతమ స్వస్థలాలకు వెళ్లారు. దీంతో చెన్నై మహానగరం ఖాళీ అయిపోయింది.
అగ్రహీరో, టీవీకే పార్టీ చీఫ్ విజయ్.. ఈనెల 19వతేదీన జరిగే సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కరూర్‌లో తొక్కిసలాట జరిగి మొత్తం 41 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 23వతేదీన తమిళనాడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అయితే.. ప్రధాని పర్యటనను తొలుత మదురై పట్టణంలో ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించగా.. దానిని రాజధాని చెన్నైకి మార్చారు. వివరాలిలా ఉన్నాయి.
చెన్నై మహానగరంలో.. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. ఈ బస్సులు గతంలో నగరంలో అందుబాటులో ఉండేవి. అయితే.. మళ్లీ వీటిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించి మళ్లీ వీటిని సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ఎస్పైకి అన్నీతానై పెంచిన పినతల్లి మృతిని తట్టుకోలేక ఓ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకుంటానంటూ.. వైద్య విద్యార్థినిని అనడంతో సవతి తల్లి హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. హర్షిణి (22) అనే వైద్య విద్యార్థిని హత్యకు గురైంది. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రంలోని వేలాంకన్నికి వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వేలాంకన్ని ఆరోగ్యమాత ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో వెళుతుంటారు. అయితే.. వీరి సౌకర్యార్థం హెలికాప్టర్‌ను ఏర్పాటుచేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.