DMK MP Kanimozhi: ప్రజాస్వామ్యాన్ని చంపే యత్నమే ‘సర్’...
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:15 PM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు యత్నిస్తున్నారని డీఎంకే ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. తూత్తుకుడిలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ముందు ‘సర్’ అత్యవసరంగా అమలుచేయాల్సిన అవసరం లేదన్నారు.
- డీఎంకే ఎంపీ కనిమొళి
చెన్నై: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు యత్నిస్తున్నారని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) వ్యాఖ్యానించారు. తూత్తుకుడిలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ముందు ‘సర్’ అత్యవసరంగా అమలుచేయాల్సిన అవసరం లేదన్నారు. నిజాయితీగా, న్యాయం గా నిర్వహించాలనే ఉద్ధేశం ఉంటే, తగినంత సమయం ఇచ్చి నిర్వహించేవారని అన్నారు. సర్ తీరును బిహార్‌లో స్పష్టంగా చూశామని,

ఈ ప్రక్రియ మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో కూడా ఉందన్నారు. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Congress MP Rahul Gandhi), సర్ పేరుతో జరుగుతున్న అన్యాయాలు గణాంకాలతో వివరించారని, అందుకు ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) పూర్తి మద్దతు తెలిపారని గుర్తుచేశారు. సర్‌కు వ్యతిరేకంగా డీఎంకే, మిత్రపక్షాలు ఈ నెల 11న ఆందోళనలు చేపట్టనున్నట్లు కనిమొళి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
కిసాన్ డ్రోన్.. సాగు ఖర్చు డౌన్
Read Latest Telangana News and National News