Share News

TVK Vijay: ప్రత్యేక చిహ్నం కోసం టీవీకే పార్టీ దరఖాస్తు..

ABN , Publish Date - Nov 12 , 2025 | 10:33 AM

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రత్యేక చిహ్నం కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమకు ఓడ, విజిల్‌, ఆటో, క్రికెట్‌ బ్యాట్‌ తదితర 10 గుర్తుల్లో ఒకదాన్ని కేయించాల్సిందిగా మంగళవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించింది.

TVK Vijay: ప్రత్యేక చిహ్నం కోసం టీవీకే పార్టీ దరఖాస్తు..

- ఎన్నికల సంఘానికి అందజేసిన పార్టీ ప్రతినిధులు

చెన్నై: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రత్యేక చిహ్నం కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమకు ఓడ, విజిల్‌, ఆటో, క్రికెట్‌ బ్యాట్‌ తదితర 10 గుర్తుల్లో ఒకదాన్ని కేయించాల్సిందిగా మంగళవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించింది. టీవీకే(TVK) సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల్‌ కుమార్‌, సీనియర్‌ నాయకుడు అర్జున మూర్తి తదితరులు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌, ఇతర కమిషనర్లను కలిసి దరఖాస్తు అందించారు.


గత ఫిబ్రవరి 7వ తేదీ కేంద్ర ఎన్నికల కమిషన్‌లో టీవీకే ప్రాంతీయ పార్టీగా రిజిస్టర్‌ అయ్యింది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతున్న విజయ్‌ గెలుపే లక్ష్యంగా, పార్టీ తరఫున ఎన్నికల పర్యవేక్షణ, ప్రచార విభాగం, పోలింగ్‌ బూత్‌, ప్రచార సభలు, బహిరంగ సభల నిర్వహణకు తదితర సభలను నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలను కూడా నియమించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధన ప్రకారం, కొత్త పార్టీలు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నికల చిహ్నాన్ని పొందేందుకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.


nani1.2.jpg

ఆ మేరకు టీవీకే తరఫున ఆ పార్టీ నేతలు చిహ్నం కోసం దరఖాస్తు సమర్పించారు. ఎన్నికల కమిషన్‌ మొత్తం 184 చిహ్నాలతో విడుదల చేసిన జాబితాలో పదింటిని ఎంపిక చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిని ఎన్నికల కమిషన్‌ పరిశీలించి ఒక గుర్తును ఇండిపెండెంట్‌గా కేటాయిస్తుంది. పార్టీకి కేటాయించే చిహ్నం నిర్ధారణ అయ్యాక దానిని ప్రజల్లోకి త్వరగా తీసుకెళ్లనున్నట్లు టీవీకే వర్గాలు తెలిపాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

హాయ్‌ల్యాండ్‌కు గ్రూప్‌-1 పత్రాల తరలింపుపై రికార్డుల్లేవ్‌

తిరుమల లడ్డూ మిఠాయి కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 12 , 2025 | 10:42 AM