Tamilisai Soundararajan: సర్ పై తమిళిసై కామెంట్స్.. ఇడియాప్పం కాదు.. ‘ఇడ్లీ’
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:41 PM
కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఓటర్లకు సమస్య కలిగించే ‘ఇడియాప్పం’ కాదని, సులువుగా జీర్ణమయ్యే ‘ఇడ్లీ’ వంటిదని బీజేపీ మహిళా నాయకురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కామెంట్ చేశారు.
చెన్నై: కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఓటర్లకు సమస్య కలిగించే ‘ఇడియాప్పం’ కాదని, సులువుగా జీర్ణమయ్యే ‘ఇడ్లీ’ వంటిదని బీజేపీ మహిళా నాయకురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan) కామెంట్ చేశారు. కేకే నగర్‌లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ...

సర్ పనులు ఇడియాప్పంలా చిక్కులతో ముడులతో కూడుకున్నవని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister MK Stalin) విమర్శిడం గర్హనీయమన్నారు. వంటికి పోషకాలనందించే ఇడ్లీ ఎలాంటిదో ప్రజాస్వామ్యానికి బలాన్నిచ్చేది ‘సర్’ మాత్రమేనని ఆమె కామెంట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హాయ్‌ల్యాండ్‌కు గ్రూప్-1 పత్రాల తరలింపుపై రికార్డుల్లేవ్
Read Latest Telangana News and National News