Home » Chandrababu
అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, నారా లోకేశ్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది. హైదరాబాద్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను శాస్త్రీయంగా నిర్వహించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరోసారి నిప్పులు చెరిగారు. సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో మంత్రి సవిత విలేకర్లతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మహిళల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కీలక పోరులో సమష్టి ప్రదర్శనతో టీమ్ఇండియా విజయం సాధించడం భారత క్రీడాభిమానులకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఎల్లుండి అమరావతికి వస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని పథకం ద్వారా ఏపీలో గ్రామీణ ఆరోగ్య సేవలు 'గేమ్ ఛేంజర్' కాబోతున్నాయని ఆయన తెలిపారు..
పార్టీ ఎమ్మెల్యేలు, నేతల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, వారి పనితీరుకు సంబంధించిన నివేదికలను సీల్డ్ కవర్లలో ఇస్తున్నామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ నివేదికల ద్వారా వారిని.. వారికే అద్దంలో చూపిస్తున్నామని, మారకపోతే వారికే నష్టమని హెచ్చరించారు..
రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు 30వేల కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, సేవా రంగాల నుంచి ఆదాయం పెరగాలని, ఒంగోలు పాలు, అనంతపురం పండ్లకు మంచి డిమాండ్ ఉందని చంద్రబాబు అన్నారు.
అసెంబ్లీ సమావేశాలు మొదలైన నేపథ్యంలో మంత్రుల పనితీరు, ప్రవర్తనపై సీఎం చంద్రబాబు స్పష్టమైన మార్గదర్శకాలిచ్చారు. సమయపాలన ఉండాలని, బాధ్యతాయుత ప్రసంగాలు చేయాలని.. అసెంబ్లీలో 'ఆవు కథలు' చెప్పవద్దని సూచించారు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు.. మంత్రివర్గ సమావేశానికి ముందు NDA నేతలతో భేటీ అయ్యారు. సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు గుంటూరులోని ఆయన నివాసం వద్ద అరెస్టు చేసి, ఆందోళనకారుల నుంచి రక్షణగా 'వజ్ర' వాహనంలో తరలించారు.