Share News

Chandrababu Naidu: అధికారులు అందరూ కేబినెట్ సమయానికి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Dec 29 , 2025 | 03:13 PM

కేబినెట్ సమావేశానికి అధికారులు అందుబాటులో లేకపోవడంపై సీఏం అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ అంశాలపై చర్చ జరిగిన సమయంలో అధికారుల వ్యవహారంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరిగింది.

Chandrababu Naidu: అధికారులు అందరూ కేబినెట్ సమయానికి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశానికి అధికారులు అందుబాటులో లేకపోవడంపై సీఏం అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ అంశాలపై చర్చ జరిగిన సమయంలో అధికారుల వ్యవహారంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. అధికారులు అందరూ కేబినెట్ సమయానికి ఉండాల్సిందేనని, ఆఫీసర్లు అందరూ తప్పనిసరిగా రావాల్సిందేనని ఆదేశించారు (Andhra Pradesh CM).


ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. పోలవరం జిల్లాను ప్రకటించడంపై మంత్రి కందుల దుర్గేష్ ప్రశ్నించారు. పోలవరం లేకుండా పోలవరం జిల్లా ఏమిటని దుర్గేష్ అడిగారు. ఆ ప్రశ్నకు సీఎం స్పందిస్తూ.. నిర్వాసితులు ఉన్నారని ఆ జిల్లా పేరు అలా మార్చాల్సి వచ్చిందని చెప్పారు. ఎన్టీయార్ ఊరు లేకుండా ఎన్టీయార్ జిల్లా పేరు పెట్టాం కదా అని గుర్తు చేశారు. అలాగే ప్రతి జిల్లాకు ఒక పోర్ట్ వచ్చేలా చేసినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు (AP cabinet meeting).


పశ్చిమ గోదావరి జిల్లాకు మాత్రం ఒక్క పోర్ట్ కూడా లేదని, దానిపై దృష్టి సారించాలని సీనియర్ ఐయేఎస్ అధికారి కృష్ణబాబుకు సీఎం సూచించారు (Andhra Pradesh cabinet news). నవంబర్ నుంచి విద్యుత్ చార్జీలు యూనిట్‌కు 13 పైసలు ట్రూ డౌన్ చేసిన ఘనత మన ప్రభుత్వానిదే అన్న సీఎం పేర్కొన్నారు. అలాగే కుప్పం, దగదర్తి, ఎయిర్ పోర్టులు డెవలప్ చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.


ఇవి కూడా చదవండి..

ఇది రైలా లేక మిసైలా.. గంటకు 700 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ రైలు గురించి తెలుసా..


వైద్య ప్రపంచంలోనే అద్భుతం.. పాదం మీద చెవి పెట్టి కాపాడారు..

Updated Date - Dec 29 , 2025 | 09:41 PM