AP Resurvey: ఏపీ రీ సర్వే ప్రాజెక్టుకు, గురుకులాలకు నిధులు మంజూరు
ABN , Publish Date - Dec 02 , 2025 | 06:48 AM
ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా కీలకరంగాలకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టుకు అదనపు నిధులు మంజూరు చేసింది. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా గురుకులాలకు రూ.39 కోట్ల అదనపు నిధులు విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: భూముల రీసర్వే, గురుకుల పాఠశాలలకు నిధులు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది రీ-సర్వే పట్టాదారు పాస్‌పుస్తకాలు, అంబేద్కర్ గురుకులాలకు అదనపు నిధులు విడుదల చేసింది. రైతుల సంక్షేమంతోపాటు విద్యారంగాన్నీ మరింత బలోపేతం చేసే దిశగా ఈ రెండు ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో భూముల రీ-సర్వే ప్రాజెక్టుకు రూ.12 కోట్ల అదనపు నిధుల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది.
ఈ నిధులు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్‌బుక్కుల ముద్రణకు ఉపయోగపడతాయి. ఫేజ్-1 నుంచి ఫేజ్-4 వరకు రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు పాస్‌బుక్కులు జారీ చేయ్యనున్నారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది.
అలాగే, విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాలకు రూ.39 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసింది. పెండింగ్‌లో ఉన్న 135 పనులు.. వీటిలో తరగతి గదులు, హాస్టల్ భవనాల నిర్మాణం, నూతన భవనాల నిర్మాణం మొదలైనవి పూర్తి చేయడానికి ఈ నిధులు వినియోగించనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం. నాయక్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. రైతుల ఆస్తి హక్కుల భద్రతకు, గిరిజన-దళిత విద్యార్థుల మెరుగైన విద్యా వసతులకు ఈ రెండు నిర్ణయాలు దోహదపడతాయి.
ఇవీ చదవండి:
ఐటీ రిఫండ్స్ ఇంకా రాలేదా? అయితే..
ప్రమోషనల్ స్కీములపై జీఎస్‌టీ ఉంటుందా?
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి