Home » Chandrababu naidu
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండంటంతో తెలుగుదేశం పార్టీ చేరికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ(YSRCP) నుంచి టీడీపీ(TDP)లోకి భారీగా నేతలు చేరుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా టీడీపీ హై కమాండ్ పలు ప్రణాళికలు రచిస్తోంది.
నగరంలో ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ రేపు(గురువారం) జరగనున్నది. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాజాగా జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. వైసీపీదీ దున్నపోతు ప్రభుత్వమని విమర్శించిన ఆయన.. ‘యాత్ర 2’ ఒక చెత్త సినిమా అని దుయ్యబట్టారు. మన్యం జిల్లాలో జరిగిన శంఖారావం సభలో లోకేశ్ మాట్లాడుతూ.. కలుషిత నీరు తాగి మృతి చెందిన కుటుంబాలను కూడా పరామర్శించని దిక్కుమాలిన సీఎం జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి సమీపంలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇంటికి దగ్గరలో ఉన్న తాటి చెట్లకు ఒక్కసారిగా నిప్పు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. ఇది ఒక హై సెక్యూరిటీ జోన్ కావడంతో.. పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) పేరిట విజయవాడలో ‘‘మహా స్వాప్నికుడు చంద్రబాబు’’ అనే పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ చేతులమీదుగా ఈ పుస్తకావిష్కరణ జరిగింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనపై కూలీ, నీలి మీడియా విషయం కక్కుతోంది. పేటీఎం బ్యాచ్ మొత్తం తప్పుడు వార్తల్ని వ్యాప్తి చేస్తోంది. అమిత్ షా కాళ్లను చంద్రబాబు మొక్కారని ఒక మార్ఫింగ్ ఫోటోను.. ఇదే సమయంలో ప్రధాని మోడీ ముందు చంద్రబాబు చేతులు కట్టుకొని నిలబడినట్టు మరో మార్ఫింగ్ ఫోటోని ఆ పేటీఎం బ్యాచ్ వైరల్ చేస్తోంది.
రాబోయే ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే సీఎం జగన్ మైండ్ బ్లాంక్ కావాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అన్నారు.
మైలవరం నియోజకవర్గం అన్నేరావుపేటలో ఫిబ్రవరి రెండో వారంలో తాను ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) అన్నారు.
సీఎం జగన్ రెడ్డి(CM Jagan Reddy) ఎన్నికల హామీల మోసాలను ఎండగడుతూ... ‘ప్రజాకోర్టు’ పేరుతో ఛార్జ్ షీట్ పేరుతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో విడుదల చేశారు.
సీఎం జగన్ రెడ్డి(CM JAGAN)కు ఓటమి భయంతోనే అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) అన్నారు. చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాదరణతో వైసీపీ ఫ్యాను రెక్కలు విరిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు.