Home » Champions Trophy 2025
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కి టీమిండియాను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఆకట్టుకున్నాడు. పది ఓవర్లు బౌలింగ్ చేసి 28 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన గిల్ వికెట్ తీశాడు.
ICC Champions Trophy 2025 Final: 12 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు భారత్ ముందు సువర్ణావకాశం. రేపు కివీస్‌తో జరిగే ఆఖరి పోరులో గెలిస్తే కప్పుతో స్వదేశానికి చేరుకోవచ్చు.
IND vs NZ: కొదమసింహాల మధ్య కొట్లాటకు సర్వం సిద్ధమవుతోంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ కోసం భారత్-న్యూజిలాండ్ రెడీ అవుతున్నాయి. దుబాయ్ వేదికగా జరిగే ఆఖరాటలో గెలిచిన టీమ్ కప్పుతో స్వదేశానికి బయల్దేరుతుంది.
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ వ్యూహాలకు పదును పెడుతున్నాడు. కివీస్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మాస్టర్ స్ట్రాటజీలు రెడీ చేస్తున్నాడు. వీళ్లిద్దరూ త్రిశూల వ్యూహంతో సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Champions Trophy Final 2025: టీమిండియా బిగ్ చాలెంజ్‌కు రెడీ అవుతోంది. చాంపియన్స్ ట్రోఫీ వేటలో ఉన్న రోహిత్ సేన.. కప్పు కోసం ఆఖరాటకు సిద్ధమవుతోంది. ఇక్కడ గెలిస్తే ట్రోఫీతో స్వదేశానికి పయనం అవ్వొచ్చు.
భారత్ ఆడాల్సిన మ్యాచులన్నీ దుబాయ్‌లో ఖరారు కావడంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది హాస్యాస్పదం అని, తలవంపులు తెచ్చేదని వ్యాఖ్యానించారు.
Champions Trophy Finals 2025: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆసాంతం దుమ్మురేపుతున్న భారత జట్టు.. ఇప్పుడు తుది పోరాటానికి సిద్ధమవుతోంది. న్యూజిలాండ్‌తో జరిగే సండే ఫైట్‌లో గనుక గెలిస్తే టీమిండియా ఒడిలో మరో ఐసీసీ ట్రోఫీ ఒదిగిపోతుంది. అయితే ఇది అంత ఈజీ కాదు. సారథి రోహిత్ శర్మ పలు సవాళ్లను దాటాల్సి ఉంటుంది.
ICC Champions Trophy 2025: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జోరు మీదున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో అటు కీపింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతూ భారత విజయాల్లో అతడు కీలకపాత్ర పోషిస్తున్నాడు. అలాంటోడు సారథి రోహిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Bangladesh: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫెయిల్యూర్ పలువురు క్రికెటర్ల కెరీర్‌లకు ఎండ్ కార్డ్ వేస్తోంది. ఒక్కొక్కరుగా కొందరు సీనియర్ ప్లేయర్లు రిటైర్మెంట్ బాట పడుతున్నారు. తాజాగా ఓ బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. మరోసారి భారత్, న్యూజిలాండ్ జట్లు దుబాయ్ వేదికగా పోటీపడి టైటిల్ వేట సాగించబోతున్నాయి. లాహోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్ పోరులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.