Share News

David Llyod: ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూలింగ్‌పై కొనసాగుతున్న వివాదం.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ విమర్శలు

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:14 PM

భారత్ ఆడాల్సిన మ్యాచులన్నీ దుబాయ్‌లో ఖరారు కావడంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది హాస్యాస్పదం అని, తలవంపులు తెచ్చేదని వ్యాఖ్యానించారు.

David Llyod: ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూలింగ్‌పై కొనసాగుతున్న వివాదం.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ విమర్శలు
David Llyod ICC Sent Brutal Message Over Champions Trophy 2025

ఇంటర్నెట్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా ఆడటం అనేక మంది అంతర్జాతీయ క్రికెటర్లకు నచ్చడం లేదు. దీంతో, ఐసీసీపై వారందరూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ జాబితాలోకి తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వచ్చి చేరారు. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల షెడ్యూలింగ్ తలవంపులు తెచ్చేదిగా హాస్యాస్పందంగా ఉందని డేవిడ్ లాయిడ్ విమర్శలు గుప్పించారు (David Llyod Criticises Champions Trophy Sceduling).

‘‘ఇది నిజంగా నాన్సెన్స్. అసలు ఈ పరిణామాల్ని ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది ఓ ప్రపంచస్థాయి కార్యక్రమం. టీమ్‌లు ఒక చోట నుంచి మరోచోటకు ప్రయాణిస్తుంటాయి. ఒక్కోసారి వెళ్లిన ప్రాంతానికి వెళతామో లేదో కూడా స్పష్టత ఉండదు. వాస్తవానికి నేను హాస్యప్రియుణ్ణే. అయితే, ఓ ప్లేయర్ మాత్రం ఇదేమంత లైట్ తీసుకునే విషయం కాదు’’ అంటూ విమర్శలు ఎక్కువపెట్టారు.


BCCI vice president Lavs samadhi: పాక్‌లో శ్రీరాముడి తనయుడి సమాధిని సందర్శించిన బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్

ప్రస్తుత టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇస్తుండగా భారత్ తప్ప టోర్నీలో పాల్గొనే ఇతర దేశాలు పాక్, దుబాయ్ మధ్య చక్కెర్లు కొడుతున్నాయి. టీమిండియాను పాక్‌కు పంపించే ప్రసక్తే లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో, భారత్ మ్యాచులన్నీ దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియం వేదికగా జరిగాయి. దీంతో, స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇది భారత్‌కు ఉపకరిస్తుందని అనేక మంది క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. అన్యాయంగా భారత్‌కు లాభం చేకూర్చే పరిణామని విమర్శించారు. ఫైనల్స్ సమీపిస్తున్న తరుణంలో విమర్శలు జడి మరింత పెరిగింది.


కివీస్‌తో సులువేం కాదు!

ఇక దక్షిణాఫ్రికాపై భారీ విజయంతో న్యూజిలాండ్ టోర్నీ ఫైనల్స్‌కు చేరుకుంది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్స్ అజేయ సెంచరీలతో న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేరుకోలేక దక్షిణాఫ్రికా ఓటమి చవి చూసింది. డేవిడ్ మిల్లర్ సెంచరీ చేసినా దక్షిణాఫ్రికాకు నిరుపయోగంగా మారింది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్‌లో దక్షిణాప్రికాకు ఇది వరుసగా ఐదో ఓటమి, 2000, 2002, 2006, 2013 టోర్నీల్లో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా ఓటమితో వెనుదిరగాల్సి వచ్చింది.

Read Latest and Sports News

Updated Date - Mar 07 , 2025 | 12:17 PM