BCCI vice president Lavs samadhi: పాక్‌లో శ్రీరాముడి తనయుడి సమాధిని సందర్శించిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
ABN , Publish Date - Mar 07 , 2025 | 09:38 AM
పీసీబీ ఆహ్వానం మేరకు పాక్‌కు వెళ్లిన బీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా.. లాహోర్‌లోని శ్రీరాముడి తనయుడు లవుడి సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు.

ఇంటర్నెట్ డెస్క్: పాక్ పర్యటనలో ఉన్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మార్చి 6న లాహోర్‌లోని శ్రీరాముడి తనయుడు లవుడి సమాధానికి సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాక్ హోమ్ మంత్రి మోషీన్ నఖ్వీ మాట్లాడుతూ సమాధికి రిపేర్లే చేసి అవసరమైన మేరకు మెరుగులు దిద్దుతున్నట్టు తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లవుడి సమాధిపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు (BCCI vice president Rajeev Shukla offers prayers at Lav's samadhi).
అనంతరం, శుక్లా తన మనసులో మాటను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘‘శ్రీరాముడి తనయుడు లవుడి పేరు మీద లాహోర్ నగరం ఏర్పాటు చేశారు. కసూర్ నగరానికి కుశుడి పేరు పెట్టారు. పాక్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని అంగీకరించింది’’ అని శుక్లా ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు.
‘‘పురాతన లాహోర్ కోటలో శ్రీరాముడి తనయుడు లవుడి సమాధి ఉంది. అక్కడ నాకు ప్రార్థన చేసే అవకాశం దక్కింది. నా వెంట పాక్ హోం శాఖ మంత్రి కూడా ఉన్నారు. ఆయన సారథ్యంలో సమాధిని పునరుద్దరిస్తున్నారు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆహ్వానం మేరకు రాజీవ్ శుక్లా పాక్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స ట్రోఫీకి ఆతిథ్య దేశంగా పాక్ వ్యవహరిస్తున్నా భద్రతా కారణాల రీత్యా భారత్ పాక్‌లో మ్యాచులకు నిరాకరించింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు పాక్‌లో పర్యటించదని బీసీసీఐ స్పష్టం చేయడంతో దుబాయ్ వేదికగా భారత మ్యాచులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్లా పాక పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇక ప్రస్తుత ఛాంపియన్స్ ట్రాఫీ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. మార్చి 9న భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఫైనల్స్ మ్యాచ్‌పై అందరి దృష్టి కొనసాగుతోంది. ఈ టోర్నీలో గ్రూప్ ఏ టీమ్‌గా బరిలోకి దిగిన భారత్ వరుస విజయాలు అందుకుంటూ ఫేవరెట్‌గా నిలుస్తోంది. ఈ గ్రూప్‌లోని పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇప్పటికే టోర్నీ నుంచి వైదలగాయి. దీంతో, శుక్లా పర్యటన ఆసక్తికరంగా మారింది.