తిప్పేసిన కెర్
ABN , Publish Date - Mar 07 , 2025 | 06:28 AM
హేలీ మాథ్యూస్ (46 బంతుల్లో 68) అర్ధ శతకంతోపాటు అమేలియా కెర్ (5/38) తిప్పేయడంతో.. మహిళల ప్రీమియర్ లీగ్ ముంబై ఇండియన్స్ రెండో స్థానానికి...

డబ్ల్యూపీఎల్‌లో నేడు
ఢిల్లీ గీ గుజరాత్
రాత్రి 7.30 నుంచి
స్టార్ స్పోర్ట్స్‌లో
6 వికెట్లతో ముంబై విజయం
యూపీ ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరి!
వోల్ ఫిఫ్టీ వృథా
లఖ్‌నవూ: హేలీ మాథ్యూస్ (46 బంతుల్లో 68) అర్ధ శతకంతోపాటు అమేలియా కెర్ (5/38) తిప్పేయడంతో.. మహిళల ప్రీమియర్ లీగ్ ముంబై ఇండియన్స్ రెండో స్థానానికి ఎగబాకింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 6 వికెట్లతో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది. వరుసగా మూడో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను యూపీ మరింత సంక్లిష్టం చేసుకొంది. తొలుత యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 150/9 స్కోరు చేసింది. కెర్ ఐదు వికెట్లకు తోడు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మాథ్యూస్ 2 వికెట్లు పడగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్‌కు ఓపెనర్లు జార్జియా వోల్ (33 బంతుల్లో 55), గ్రేస్ హ్యారిస్ (28) తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యంతో అదిరే ఆరంభాన్నిచ్చారు. అయితే, 14 బంతుల తేడాతో మూడు కీలక వికెట్లను చేజార్చుకోవడంతో.. యూపీ ఓమాదిరి స్కోరుకే పరిమితమైంది. హ్యారిస్ ను అవుట్ చేసిన మాథ్యూస్.. జట్టుకు బ్రేక్ అందించింది. కిరణ్ నవ గిరె (0)ను కెర్ డకౌట్ చేయగా.. హాఫ్ సెంచరీతో జోరుమీదున్న వోల్‌ను బ్రంట్ బౌల్డ్ చేసింది. వ్రింద (10), హెన్రీ (6), దీప్తి (27), సోఫీ ఎకెల్‌స్టోన్ (16)ను కెర్ పెవిలియన్ చేర్చింది. అనంతరం ఛేదనలో ముంబై 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 153 పరుగులు చేసి నెగ్గింది. హ్యారిస్ 2 వికెట్లు పడగొట్టింది. ఓపెనర్ కెర్ (10)ను హెన్రీ స్వల్ప స్కోరుకే అవుట్ చేసింది. కానీ, హేలీ, వన్‌డౌన్‌లో వచ్చిన సివర్ బ్రంట్ (37) రెండో వికెట్‌కు 58 బంతుల్లో 92 పరుగులు జోడించడంతో..
ముంబై అలవోకగా నెగ్గింది. హేలీ నాలుగు బౌండ్రీలు, సిక్స్‌తో చెల రేగడంతో.. పవర్‌ప్లేలో ముంబై 50/1తో నిలిచింది. మధ్య ఓవర్లలో వీరిద్దరూ పోటీపడి మరీ షాట్లు ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. 11వ ఓవర్‌లో బౌండ్రీతో మాథ్యూస్ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. జట్టుస్కోరు సెంచరీ మార్క్‌ను అందుకొంది. అయితే, వరుస ఓవర్లలో బ్రంట్, మాథ్యూస్, ఆపై హర్మన్‌ప్రీత్ (4) అవుటైనా.. అమన్‌జోత్ (12 నాటౌట్), యాస్తిక భాటి యా (10 నాటౌట్) మరో 9 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించారు.
సంక్షిప్త స్కోర్లు: యూపీ: 20 ఓవర్లలో 150/9 (వోల్ 55, హ్యారిస్ 28; కెర్ 5/38, హేలీ 2/25); ముంబై: 18.3 ఓవర్లలో 153/4 (మాథ్యూస్ 68, బ్రంట్ 37;
హ్యారిస్ 2/11).
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి