Home » Canada
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఒక టీవీ యాడ్ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఏకంగా కెనడాతో జరుగుతున్న వాణిజ్య చర్చలు నిలిపివేతకే కారణమైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ కేంద్రంగా రూపొందించిన ఓ యాడ్ కెనడాకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులైన గ్యాంగ్‌స్టర్ గోల్డీ దిల్లాన్, కుల్దీప్ సిద్దు ఈ దాడి తామే చేసినట్లు ప్రకటించుకున్నారు. ఈ మేరకు కుల్దీప్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.
మిస్సిసాగాలో భారతీయులను అవమానిస్తూ గోడలపై విద్వేషపూరిత రాతలు రాసిన మహిళను తాజాగా అరెస్టు చేశారు. అనంతరం 5 వేల డాలర్ల పూచీకత్తుపై ఆమెను విడుదల చేశారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత సినిమాలపై వెళ్లగక్కుతున్న అక్కసు కెనడా వరకూ చేరింది. కన్నడ సినిమా కాంతార చాప్టర్ 1, పవన్ లేటెస్ట్ మూవీ ఓజీ ప్రదర్శిస్తున్న కెనడాలోని థియేటర్‌ను దుండగులు తగులబెట్టారు.
ప్రజలు తమ ఇళ్లలో ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, నేరాలను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా టెర్రరిస్ట్ సంస్థగా లారెన్స్ బిష్ణోయ్ ముఠాను ప్రకటించామని ఆనందసంగరీ తెలిపారు.
ఏడాది కాలంలో గోసల్ అరెస్టు కావడం ఇది రెండోసారి. 2023లో నవంబర్‌లో గ్రేటర్ టొరంటో ఏరియాలోని ఒక హిందూ ఆలయం వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించి అతన్ని అరెస్టు చేశారు.
మధ్యప్రాశ్చంలో సుస్థిర శాంతి నెలకొనేందుకు ద్విదేశ విధానానికి ఒట్టావా మద్దతిస్తోందని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు 'సార్వభౌమాధికార, ప్రజాస్వామ్య, సుస్థిర పాలస్తీనా' ఏర్పాటు కీలకమని పేర్కొంది.
ఖలిస్థానీ గ్రూపులు కెనడాలో నిధులు సమీకరిస్తున్న విషయం అక్కడి ఆర్థిక శాఖ విడుదల చేసిన అధికారిక నివేదికలో వెల్లడైంది. ఈ గ్రూపులు రాజకీయ లక్ష్యాల కోసం హింసను ప్రోత్సహిస్తున్నాయని అక్కడి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినట్టు నివేదికలో పేర్కొన్నారు.
ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ ఓపెన్ చేసిన Kap's Café మరోసారి దాడికి గురైంది. కెనడాలోని సరీ ప్రాంతంలో ఉన్న ఈ క్యాఫే వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. గతంలోనూ ఇదే రెస్టారెంట్‌పై ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
భారత్, కెనడాల మధ్య నెలకొన్న వివాదాలు ఇప్పుడిప్పుడే సమసిపోతున్నాయన్న సంకేతాలు వస్తున్న