Share News

Magnitude 7 Earthquake: కెనడాలో భారీ భూప్రకంపనలు.. 7.0 మాగ్నిట్యూడ్ నమోదు..

ABN , Publish Date - Dec 07 , 2025 | 07:41 AM

ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో యూకోన్‌లో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ది రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ధ్రువీకరించారు.

Magnitude 7 Earthquake: కెనడాలో భారీ భూప్రకంపనలు.. 7.0 మాగ్నిట్యూడ్ నమోదు..
Magnitude 7 Earthquake

అలాస్కా, కెనడా సరిహద్దు ప్రాంతంలో భారీ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. యూఎస్ జియోలాకల్ సర్వే (USGS) తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో యూకోన్‌లో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ది రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ధ్రువీకరించారు. 911కు భూప్రకంపనలకు సంబంధించి ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. ఇక, సోషల్ మీడియాలో సైతం భూప్రకంపనలపై జనం పెద్ద ఎత్తున చర్చించుకోవటం మొదలెట్టారు.


తాము ఉండే ప్రదేశంలో భూమి పెద్ద ఎత్తున కంపించిందని అంటున్నారు. ఉత్తర జెనీవా, అలాస్కాలకు 230 మైళ్ల దూరంలో.. వెస్ట్ వైట్ హార్స్, యూకోన్‌లకు 155 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తేలింది. అలాస్కా, కెనడా సరిహద్దు ప్రాంతంలో వచ్చిన భారీ భూప్రకంపనల కారణంగా వైట్ హార్స్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది.


అయితే, భారీ స్థాయిలో భూ ప్రకంపనలు వచ్చినా ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఇక, ఈ సంఘటనపై సెస్మాలజిస్ట్ ఆలిసన్ బర్డ్ మాట్లాడుతూ.. ‘భూప్రకంపనలు వచ్చినపుడు తమ నివాసాలు కంపించాయని, గోడలకు ఉన్న వస్తువులు కిందపడ్డాయని చాలా మంది ప్రజలు తెలిపారు. ఇళ్లు కూలిపోవటంలాంటిది జరిగినట్లు కనిపించటం లేదు. కొండ ప్రాంతంలోనే భూప్రకంపనల తీవ్ర కనిపిస్తోంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

ఆ రాశి వారికి ఈ వారం ఆర్ధికంగా బాగుంటుంది...

పల్లె నుంచి పట్నం.. రయ్‌

Updated Date - Dec 07 , 2025 | 07:46 AM