Home » BRS Chief KCR
ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలడానికి తామే కారణమని సభకు వచ్చి కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హితవు పలికారు. బీసీ రిజర్వేషన్లపై, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుంటే కేసీఆర్ సభకు ఎందుకు రారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
కేబినెట్ అనుమతి లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.లక్షా 27 వేలకోట్లు అవసరమని పేర్కొన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదని వెల్లడించారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ నాలుగేళ్లలోనే కూలిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం డిజైన్, నిర్మాణ నాణ్యతలో లోపాలున్నాయని రిపోర్టులో వెలువడిందని సీఎం రేవంత్ తెలిపారు. అన్నారం బ్యారేజ్‌లో మట్టి అంచనాలు తప్పుగా ఉన్నాయని పేర్కొన్నారు. పనుల పర్యవేక్షణలో కూడా లోపాలున్నాయని విమర్శించారు.
అసెంబ్లీలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ యాక్ట్ 285Aను సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులు లేదా అంతకు మించి నిర్వహించినా తాము సిద్ధమే అని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా, అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో మాజీమంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతో సహా ఆ పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం ఎర్రవల్లి ఫాం హౌస్‌లో సమావేశం కానున్నారు. కేసీఆర్‌తో భేటీలో పలు కీలక అంశాలపై గులాబీ నేతలు చర్చించనున్నారు.
జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులారా.... బాధపడకండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలవల్లే మీకు ఇళ్ల స్థలాలు రావడం లేదని ఆందోళన వ్యక్త చేశారు. న్యాయ నిపుణులతో చర్చించకుండా తూతూ మంత్రంగా జీవో ఇవ్వడంవల్లే ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు. ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు అడ్డగోలు హామీలిస్తూ అధికారంలోకి వచ్చాక గాలికొదిలేస్తున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
తెలంగాణ బిడ్డ అయిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్నారని.. ఆయనకు బీఆర్‌ఎస్ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. కేసీఆర్ తన పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేసినట్లే తెలంగాణ వ్యక్తులకు కూడా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వదిలేశారా అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు కాళేశ్వరం కమిషన్ నివేదికపై వేసిన పిటిషన్లపై తెలంగాణ హై కోర్టులో గురువారం విచారణ జరిగింది. రెండు పిటిషన్లను కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించింది. ఐదు అంశాలను ప్రేయర్‌గా పిటిషనర్లు పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ బిల్లుపై సుప్రీంకోర్టు తీర్పుకోసం ఎదురు చూస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.