Home » BJP
వరదలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని పదే పదే ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పారని.. కానీ, విచారణ నివేదికలో మాత్రం ఆ అక్రమాలపైన పూర్తిస్థాయిలో ఎక్కడా ప్రస్తావించలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు.
ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. యువతకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువత తమలోని శక్తిని గుర్తించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
తెలంగాణ బీజేపీ ఎంపీలు సొంత రాష్ట్రానికి అండగా నిలిచారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద ముంపుతో సతమతమవుతున్న ప్రజలకు తమ వంతు తోడ్పాటునందించారు. రాష్ట్రంలోని బీజేపీకి చెందిన ఆరుగురు ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఒక్కొక్కరు రూ. 10 లక్షల చొప్పున కేటాయించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తమ రాజకీయ పొత్తులో ఎన్నికల కమిషన్‌ను సైతం భాగం చేసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో చర్చలకు అవకాశమివ్వని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ సర్కారు బాటలోనే నడుస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం టీబీజేపీ సన్నాహక సమావేశం సాక్షిగా తెలంగాణ బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. టీబీజేపీ చీఫ్‌గా రాంచందర్‌రావు పేరుకు బదులుగా.. పదే పదే కిషన్‌రెడ్డి పేరును ప్రస్తావించారు ఎంపీ రఘునందన్‌రావు.
శివగంగ పోలీసు క్వార్టర్స్‌లో నివసిస్తున్న బీజేపీ నగర శాఖ వాణిజ్య విభాగం నాయకుడు సతీష్(51) శుక్రవారం వేకువజామున మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య జరిగిన తగాదాలో దారుణహత్యకు గురయ్యాడు. శివగంగ వారపు సంత లో సతీష్ మోటరు సైకిల్ మెకానిక్ దుకాణం నడుపుతున్నాడు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రి తల్లిని అవమానపరిచిన కాంగ్రెస్‌కు తాము గట్టి సమాధానం చెబుతామని బీజేపీ నేత నితిన్ నబీన్ తెలిపారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. కాంగ్రెస్ సైతం బీజేపీపై విరుచుకుపడింది. ఈ ఘటన వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని, నితీష్ చాలా తప్పుచేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్త డాక్టర్ అశుతోష్ అన్నారు.