నరేంద్ర మోదీ పాలనలో దేశం అభివృద్ధి
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:29 AM
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశాభివృద్ధి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తంరెడ్డి అన్నారు.
కోసిగి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశాభివృద్ధి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తంరెడ్డి అన్నారు. కోసిగిలోని బెళగల్ రోడ్డులో శుక్రవారం బీజేపీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంబించారు. బీజేపీ మండల అధ్యక్షుడిగా జడ్లయ్యగారి ఈరన్న ఎన్నిక కావడంతో ఆయనను పూలమాల శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకుడు గురురాజ దేశాయి హాజరయ్యారు. బీజేపీ నాయకులు పెండెకళ్లు రాముడు, నరసన్న, వెంకటరెడ్డి, తమ్మారెడ్డి, దొరస్వామి, వీరేష్, నాగరాజు, రమేష్, దేవేంద్రప్ప, పాల్గొన్నారు.