Home » Bihar
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు 'నమో యాప్' ద్వారా పార్టీ మహిళా కార్యకర్తలతో మాట్లాడారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దగ్గరుండి తాను చూశానని, భారీ మెజారిటీతో ఎన్డీయే గెలుస్తుందని తాను చెప్పగలనని అన్నారు.
మొకామా ప్రాంతంలో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ తరఫున లలన్ సింగ్ ఇటీవల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పోలింగ్ రోజున విపక్ష నేతలను ఇళ్ల నుంచి బయటకు రానీయరాదని, ఇళ్లకు తాళాలు వేయాలని సూచించారు.
తేజస్విని సీఎం చేయాలని లాలూ, రాహుల్ గాంధీని ప్రధాని కావాలని సోనియాగాంధీ కలలు కంటున్నారని, అయితే వాళ్లు ఆ విషయం మరిచిపోవచ్చని, ఎందుకుంటే ఆ రెండు పోస్టులు ఖాళీగా లేవని అమిత్‌షా ఛలోక్తి విసిరారు. ఇక్కడ సీఎంగా నితీష్, అక్కడ పీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారని చెప్పారు.
ఎన్నికల ప్రచారం చాలా బాగా జరుగుతోందని, కూటమి విజయం సాధిస్తుందని లాలూ చెప్పారు. స్థానిక నేతలు కూడా బాగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందని, తేజస్వికి ప్రజా మద్దతు ఉందని తెలిపారు.
సోషలిస్టు అగ్రనేతలైన జయప్రకాశ్ నారాయణ్, రామ్‌మనోహర్ లోహియా, కర్పూరి ఠాకూర్ సిద్ధాంతాలకు నీతీష్ కుమార్ తూట్లు పొడిచారని ఖర్గే విమర్శించారు. మను స్మృతిని నమ్మే మహిళా వ్యతిరేకి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాదని ప్రియాంక విమర్శించారు. ప్రధాని, ఇతర కేంద్ర నాయకులు న్యూఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు.
బిహార్‌లోని సహర్సాలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మాట్లాడుతూ, ప్రజలకు అందే ఎలాంటి సాయమైనా 'జంగిల్ రాజ్' నేతలు నిలిపేస్తారని, వారికి అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉండదని చెప్పారు.
కాంగ్రెస్ మద్దతుతో ఆర్జేడీ పాలన సాగించినప్పుడు పేదలను పట్టించుకోలేదని, రేషన్, ప్రభుత్వ స్కీములు దక్కనీయలేదని యోగి అన్నారు. 2005కు ముందు కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో పేద ప్రజలు జబ్బు పడితే కనీస వైద్య సౌకర్యాలు లేక ప్రాణాలు కోల్పోయే వారని తెలిపారు.
ప్రజల ఉత్సాహం చూస్తుంటే మరోసారి ఎన్డీయే గెలుపు ఖాయమని తాను చెప్పగలనని మోదీ అన్నారు. ఎన్డీయే చేపట్టిన అభివృద్ధి మోడల్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఇది చాటుతోందన్నారు.
కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తన కుమారుడు తేజస్వి యాదవ్ బిహార్ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు అమిత్‌షా చెప్పారు. అయితే ఆ రెండు సీట్లూ ఖాళీగా లేవని అన్నారు.