Home » Bihar Elections 2025
చిరాగ్ పాశ్వాన్ ఎల్‌జేపీకి 25 సీట్లు, హెచ్ఏఎం నేత జితిన్ రామ్ మాంఝీకి 7 సీట్లు, ఉపేంద్ర కుష్వాహ ఆర్ఎల్ఎంకు 6 సీట్లు బీజేపీ ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. తమ పార్టీ నేతలకు నిర్దిష్ట నియోజకవర్గాలు కేటాయించాలని చిరాగ్ పాశ్వాన్ కోరుతుండటంతో చర్చలు కొనసాగుతున్నాయి.
కాంగ్రెస్ 78 సీట్లు అడుగుతుండగా, 48 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సుముఖంగా ఉన్నారు. దీంతో మధ్యేమార్గంగా కాంగ్రెస్‌కు 55 సీట్లు వరకూ కేటాయించవచ్చని అంచనా వేస్తున్నారు.
నితీష్ కుమార్ సారథ్యంలోని ప్రభుత్వం పని తీరు గొప్ప సంతృప్తిని ఇచ్చిందని 42 శాతం మంది స్పందించగా, చాలా సంతృప్తిగా ఉందని 31 శాతం మంది, సంతృప్తిగా ఉందని 31 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
జనతాదళ్(యునైటెడ్) చీఫ్ అయిన 74 ఏళ్ల నితీష్ కుమార్ గత రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసి 'సుశాసన్ బాబు'గా ఆయన పేరు తెచ్చుకున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి బిహార్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించారు.