Share News

Bihar Assembly Elections: 11 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా విడుదల

ABN , Publish Date - Oct 06 , 2025 | 05:54 PM

ఆమ్ ఆద్మీ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి బిహార్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించారు.

Bihar Assembly Elections: 11 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా విడుదల
Arvind Kejriwal

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) పోటీ చేసే 11 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోమవారంనాడు విడుదల చేసింది. బిహార్‌లో ఆప్ పోటీ చేస్తుండటం ఇదే మొదటిసారి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి బిహార్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఇటీవల ప్రకటించారు. ఈ విషయాన్ని ఆప్ ఢిల్లీ విభాగం చీఫ్, సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ కూడా ఆ తర్వాత ధ్రువీకరించారు.


ఆప్ అభ్యర్థులు వీరే..

ఆప్ ప్రకటించిన 11 మంది అభ్యర్థులలో డాక్టర్ మీరా సింగ్-బెగుసరాయ్ (బెగుసరాయ్), యోగి చౌపల్-కుషేశ్వర్‌స్థాన్ (దర్బంగా), అమిత్ కుమార్ సింగ్-తరియ (సారణ్), భాను భారతీయ-కస్బా (పూర్ణియా), సౌభద యాదవ్-బేనిపట్టి (మధుబని), అరుణ్ కుమార్ రజక్-ఫుల్వారి షరీఫ్ (పాట్నా), డాక్టర్ పంకజ్ కుమార్-బంకీపూర్ (పాట్నా), ఆష్రాఫ్ ఆలం-కిషన్ గంజ్ (కిషన్‌గంజ్), అఖిలేష్ నారాయణ్ ఠాకూర్-పరిహార్ (సీతామర్హి), అశోక్ కుమార్ సింగ్-గోవింద్‌గంజ్ (మోతిహారి), మాజీ కెప్టెన్ ధర్మరాజ్ సింగ్-బక్సర్ (బక్సర్) ఉన్నారు.


ఎన్నికల షెడ్యూల్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌-2025ను ఎన్నికల కమిషన్ సోమవారంనాడు ప్రకటించింది. నవంబర్ 6,11 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ జరుగుతుంది. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో 2020లో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్7వ తేదీల్లో పోలింగ్ నిర్వహించి, నవంబర్ 10న ఫలితాలు ప్రకటించారు. ఎన్డీయే 125 సీట్లు గెలుచుకోగా, మహాఘట్‌బంధన్ 110 స్థానాలు దక్కించుకుంది.


ఇవి కూడా చదవండి..

ఎన్నికల ప్రక్రియ సరళం.. శాంతిభద్రతలపై డేగకన్ను

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 06 , 2025 | 05:59 PM