Home » Bihar Elections 2025
బిహార్ రాజకీయాల్లో ఇవాళ కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎమ్ఎం) బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. ఆర్జేడీ, కాంగ్రెస్.. జేఎమ్ఎం మీద రాజకీయ కుట్ర రచించాయని..
ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, రాజకీయ వారసుడు తేజస్వి యాదవ్ వరుసగా మూడోసారి రఘోపూర్ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి శకుని చౌదరి కుమారుడు సమ్రాట్ చౌదరిని తారాపూర్ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది.
మధుబన్ అసెంబ్లీ నుంచి టిక్కెట్ ఆశించిన ఆర్జేడీ నేత మదన్ షా తనకు టిక్కెట్ దక్కకపోవడంతో లాలూ నివాసం బయట కుర్తా చింపుకుని, నేలపై పడుకుని గుక్కపెట్టి ఏడుపు అందుకున్నాడు.
బిహార్‌లోని చకాయి, ధమ్‌దాహా, కటోరియా, పీర్‌పైంతీ, మనిహారి, జముయి సీట్లలో తాము అభర్థులను నిలబెట్టనున్నట్టు జేఎంఎం ప్రకటించింది. మొత్తం ఆరు సీట్లలో జేఎంఎం పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రతినిధి సుప్రియో భట్టాచార్య తెలిపారు.
భోజ్‌పురి సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సీమా సింగ్‌కు మరహోరా నియోజకవర్గం నుంచి ఎల్‌జేపీ (ఆర్‌వీ) టిక్కెట్ ఇవ్వడంతో ఆమె అక్కడ గట్టిపోటీదారుగా నిలిచారు. ప్రచారం కూడా చేపట్టారు.
ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బిహార్ అసెంబ్లీ, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ రోజుల్లో అర్హులైన అందరు ఓటర్లకు పెయిడ్ హాలిడే ప్రకటించారు. సంస్థలు, కంపెనీల యాజమాన్యాలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే, జరిమానా. .
తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై మహాకూటమిలో ఎలాంటి ఇబ్బందులు కనిపించనప్పటికీ సీట్ల పంకాల విషయంలో టెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 48 మంది అభ్యర్థుల జాబితాను గురువారంనాడు ప్రకటించింది.
బిహార్‌లోని పాట్నాలో శుక్రవారం నాడు జరిగిన మేథావుల సదస్సులో అమిత్‌షా మాట్లాడుతూ, ఆర్జేడీ ఆటవిక పాలనతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బిహార్‌లో ఏర్పాటు చేసిన పరిశ్రమలన్నీ రాష్ట్రాన్ని వదిలిపోయాయని చెప్పారు.
జాతీయ ప్రజాస్వామ్య కూటమి బిహార్‌లో నితీష్ కుమార్ సారథ్యంలో ఎన్నికలు వెళ్తోందని అమిత్‌షా ఇప్పటికే ధ్రువీకరించారు. ఎన్నికల ప్రచారానికి కూడా ఆయనే సారథ్యంం వహిస్తారని చెప్పారు.
ప్రభుత్వ పథకాలకు, పౌరులకు మధ్య వారధిగా కార్యకర్తలు నిలవాలని మోదీ అన్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలకు ఏవిధమైన లబ్ధి చేకూరుతోందో ఇంటింటికీ వెళ్లి వారికి వివరించాలని కోరారు