Home » Bhatti Vikramarka Mallu
పాడి రైతుకు భరోసా కల్పిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. విజయ డెయిరీకి ప్రభుత్వ అండగా ఉంటుందని మాటిచ్చారు. 27 లక్షల మంది విద్యార్థులకు ‘విజయ’ పాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలోని మైనారిటీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. లాభదాయక వ్యవసాయం వైపు తెలంగాణ అడుగులు వేయాలని సూచించారు.
వానాకాలం రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని 9 రోజుల్లోనే రైతులకు జమ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.
ధాన్యం దిగుబడిపైన వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. రైతు వేదికలో విత్తనాలు అందుబాటులో ఉంచాలని మార్గనిర్దేశం చేశారు.
రాష్ట్రంలో 8 మేలురకం వరి వంగడాల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
సింగరేణి కార్మికుడి శ్రమ, చెమటని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కొందరు మాట్లాడుతున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిపై చేస్తున్న ఆరోపణలతో తన మనసు కలచి వేసిందని.. అందుకే అధికారులతో కలిసి ఓపెన్‌హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేశామని వివరించారు.
తాము అధికారాన్ని అడ్డం పెట్టుకొని సింగరేణి సంస్థను దోచుకునేవాళ్లం కాదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు.
మంచిర్యాలలో సింగరేణి డిపెండెంట్ కార్మికులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 335 మంది డిపెండెంట్ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నియామక పత్రాలను అందజేశారు.
ప్రపంచానికి దిక్సూచిగా.. న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లతో పోటీ పడేలా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ఎనిమిదేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ఎవరు అడ్డుపడినా అడ్డంగా తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు....