Home » Bengaluru
ఆటోలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ కు వినూత్న అనుభవం ఎదురైంది. కార్పొరేట్ మ్యానేజర్ కంటే ఎక్కువగా ఆటో డ్రైవర్ డబ్బులు సంపాదిస్తున్నాడని తెలిసి ఒక్కసారి అవాక్కయ్యాడు. కర్ణాటక రాజధాని బెంగుళూరు కు చెందిన ఆకాష్ ఆనందానీ అనే వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఖర్గే ఇటీవల పాట్నాలో జరిగిన సీడబ్ల్యూసీలో పాల్గొన్నారు. మంగళవారం నాడు బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు, ఉత్తర కర్ణాటకలో భారీ వరదలు, పంట నష్టం బాధితులను ఆదుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.
స్కూటీతో సహా కిందపడ్డ యువతి పైనుంచి లారీ దూసుకెళ్లింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ధనుశ్రీ అక్కడికక్కడే చనిపోయింది. డ్రైవర్ లారీని ఆపకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
విప్రో క్యాంపస్ మీదుగా ట్రాఫిక్ అనుమతించాలన్న అభ్యర్థనను సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తిరస్కరించారు. క్యాంపస్‌లో అంతర్జాతీయ క్లైంట్స్‌కు సేవలందిస్తుంటామని తెలిపారు.
వైవాహిక జీవితంలో భర్త విఫలమయ్యాడంటూ ఓ మహిళ రూ.2 కోట్ల పరిహారం డిమాండ్ చేసింది. బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది.
ఎయిర్‌లైన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ IX-1086 విమానం ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరింది. గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్ వద్దకు వచ్చి దానిని తెరిచేందుకు ప్రయత్నించాడు.
కాంగ్రెస్ ఐదేళ్ల పాలన ద్వితీయార్ధంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలపై డీకే శివకుమార్‌ను అడిగినప్పుడు ఆయన సూటిగా సమాధానంగా ఇవ్వలేదు. కాలమే సమాధానం చెప్పాలని, తాను జవాబు చెప్పలేనని అన్నారు.
నగరంలో సూపర్ సిక్స్-సూపర్‌హిట్ బహిరంగ సభ నేపథ్యంలో బుధవారం ట్రాఫిక్ మళ్లించినట్లు ఎస్పీ జగదీష్ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులు అనంతపురం నగరం నుంచి కాకుండా వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్‌ఎస్ గేట్ మీదుగా నేషనల్ హైవే 44 మార్గంలో వెళ్లాలన్నారు.
బెంగళూరు జీకేవీకే రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రి కారు నడుపుతుండగా కారు సన్ రూఫ్ తెరిచి బాలుడు నిలబడ్డాడు. ఈ క్రమంలో కారు వెళ్తుండటంతో రోడ్డుపై ఉన్న ఇనుప కమ్మీ బాలుడు తలకు బలంగా తగిలింది.
మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనుమడు, జేడీఎస్ సీనియర్ నేత హెచ్ రేవణ్ణ కుమారుడైన ప్రజ్వల్ రేవణ్ణపై పలు అత్యాచార, లైంగిక దాడుల కేసులు ఉన్నాయి. ఒక అత్యాచారం కేసులో ఆయనను ప్రత్యేక కోర్టు 2025 మేలో దోషిగా ప్రకటించింది.