Bengaluru Airport Chaos: ఇండిగో సంక్షోభం.. ఎయిర్‌పోర్టులకు పరుపుతో వెళుతున్న ప్రయాణీకులు..
ABN , Publish Date - Dec 12 , 2025 | 07:38 AM
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ప్రయాణీకులు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. విమాన సర్వీసులు క్యాన్సిల్ అయితే ఏం చేయాలో ముందుగానే ఆలోచించుకుంటున్నారు. ఓ వ్యక్తి పరుపుతో ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇండిగో సంక్షోభం మెల్లమెల్లగా కుదుటపడుతోంది. విమాన సర్వీసుల విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, ఇండిగోలో టికెట్లు బుక్ చేసుకున్న కొంతమంది ప్రయాణీకులు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది పరుపుతో ఎయిర్‌పోర్టుకు వెళుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఇండిగో ప్రయాణీకుడు పరుపుతో బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. ఓ చేత్తో లగేజ్ బ్యాగ్, భుజంపై పరుపుతో ఆ వ్యక్తి కనిపించాడు.
అయితే, విమానం క్యాన్సిల్ అయిన తర్వాతే ఆ వ్యక్తి ఆ పరుపు కొన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ యువకుడు ఎవరో గానీ, చాలా తెలివిగా వ్యవహరించాడు. ఆ విమానం మళ్లీ ఎప్పుడు రీవైవ్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. అందుకే మంచి ఐడియా వేశాడు’..‘ఇకపై ఇండిగో సంస్థలో టికెట్ బుక్ చేసుకున్న వారు కచ్చితంగా ఇలా పరుపులు, దిండ్లు తీసుకెళ్లాల్సిందే. పరిస్థితి అంత దారుణంగా ఉంది’..‘అతడు కేవలం పరుపు మాత్రమే కాదు.. రిసిప్ట్, వారంటీ కార్డు, పవర్ బ్యాంక్ కూడా తీసుకుని వచ్చాడు. అతడు ఎయిర్‌పోర్టును ఇళ్లులా మార్చేశాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కేంద్రం కఠిన చర్యలు..
దేశంలో తీవ్ర సంక్షోభానికి కారణమైన ఇండిగోపై కేంద్ర విమానయాన శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఇండిగో ఆపరేషన్లలో 10 శాతాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో 200 విమాన సర్వీసులు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు.. ఇండిగోకు కేటాయించిన కొన్ని రూట్లను కూడా రద్దు చేసేందుకు డీజీసీఏ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండిగో నిర్వహణ, పైలట్ల లభ్యత సమస్యలు, టెక్నికల్ తనిఖీలకు సంబంధించిన విషయాలను పరిశీలించేందుకు డీజీసీఏ స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
మోదీ-పుతిన్ సెల్ఫీ.. అమెరికాలో భయాందోళనలు.. ట్రంప్‌పై విమర్శలు..
ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. మధ్యాహ్నం 2 నుంచి కరెంట్ కట్