Home » Bengaluru News
ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు - కారు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శ్రీశైలం-దోర్నాల ఘాట్‌రోడ్డులో మండల ఫరిదిలోని చిన్నారుట్ల సమీపంలో మంగళవారం సాయంత్రం పొద్దుపోయాక జరిగింది.
నకిలీ బంగారం అంటగట్టి కొరిటెపాడుకు చెందిన దంపతులను మోసగించి వారి నుంచి రూ. 12 లక్షలు తీసుకున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని గుంటూరు అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు.
బిహార్ శాసనసభ ఎన్నికలకు కర్ణాటక నుంచి భారీగా నగదు సమకూరుస్తున్నారని శివమొగ్గ ఎంపీ బీవై రాఘవేంద్ర ఆరోపించారు. ఈ అంశంపై గడిచిన కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతోంది.
తాను రాజకీయగా ఎదిగేందుకు, మంత్రి అయ్యేందుకు ఆర్‌ఎల్ జాలప్ప కూడా కారణమని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. జాలప్ప శతజయంతి సందర్భంగా ఆదివారం జాలప్ప అకాడమీ, జాలప్ప లా వర్సిటీ, శతమానోత్సవ భవనాలను లాంఛనంగా ప్రారంభించారు.
బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆమె జూనియర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసులు నిందితుడిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు రఘుదీక్షిత్‌కు ఐదు పదులలో మరోసారి ప్రేమ చిగురించింది. ఈనెలాఖరున ప్రముఖ గాయని వారిజాశ్రీ వేణుగోపాల్‌తో వివాహం కానుంది. బహుభాషా జానపద సంగీత ప్రముఖుడిగా రఘుదీక్షిత్‌కు పేరుంది.
ఆర్‌ఎస్ఎస్ కు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఇవి తమ కుటుంబానికి కొత్తవి కాదని, తన పోరాటాన్ని ఆపేది లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక ఐటీబీటీ శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు.
ఓ యువతి బస్టాండ్‌లో వేచిఉండగా అదే మార్గంలో వెళ్తున్నామని, డ్రాప్ చేస్తామని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన చిక్కబళ్ళాపుర జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చిక్కబళ్ళాపురలో ఓ యువతి బస్సుకోసం వేచిఉండగా సికిందర్ బాబా అనే వ్యక్తి వచ్చి మాటలు కలిపాడు.
యువకుడిని హత్యచేసి కాల్చేసిన ఘటన శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం మండలంలోని సంతేబిదనూరు వద్ద జరిగింది. రూరల్ సీఐ జనార్దన్ తెలిపిన మేరకు సంతేబిదునూరు సమీపంలో కల్లుదుకాణం నిర్వహించే ప్రాంతంలో కాల్చివేసిన శవం ఉందని సోమవారం తెలిసిందన్నారు.
ఏడాదికోసారి మాత్రమే తెరుచుకునే హాసనాంబ దేవి ఆలయం అంగరంగవైభవంగా భక్తజనం నినాదాల మధ్యన గురువారం తెరిచారు. హాసన్ జిల్లా ప్రజలు ఆదిదేవతగా కొలిచే హాసనాంబ ఆలయం మధ్యాహ్నం 12.19గంటలకు శాస్త్రోక్తంగా గర్భగుడి తలుపులు తెరిచారు.